హాట్‌ అండ్‌ స్పైసీ ఆరెంజ్‌ 'అదుగో'.!

By iQlikMovies - September 20, 2018 - 13:12 PM IST

మరిన్ని వార్తలు

ఆరెంజ్‌ కలర్‌ గాగ్రా చోళీలో ధగ ధగా మెరిసిపోతూ సిగ్గులొలుకుతూ కెమెరాకి పోజిచ్చిన ఈ బ్యూటీని గుర్తు పట్టారా? 'అదుగో' అదే మరి గుర్తు పట్టకపోతే ఎలాగండీ. ఆల్రెడీ మనసు దోచేసింది కదా. పేరు నభా నటేష్‌. 'నన్ను దోచుకుందవటే' సినిమాతో హీరో మనుసునే కాదు అందరి మనసునూ దోచేసింది. ఆగండాగండి ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. కానీ ప్రచార చిత్రాలతో, ప్రమోషన్స్‌తో హోరెత్తిపోతోంది. 'సిరి', 'సిరి'.. అంటూ ఈ ముద్దుగుమ్మ పోషించిన పాత్ర సినిమా విడుదలకు ముందే అందరికీ చేరువైపోయింది. ఈ శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సుధీర్‌బాబుకి జోడీగా నటిస్తోంది ఈ సినిమాలో నభా నటేష్‌. మరోవైపు రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'అదుగో' చిత్రంలోనూ ఈ ముద్దుగుమ్మే హీరోయిన్‌. కన్నడలో నటించిన 'వజ్రకాయ' సినిమాలో అమ్మడి పర్‌ఫామెన్స్‌ నచ్చి రవిబాబు ఏరికోరి ఈ ముద్దుగుమ్మని తన సినిమాలో హీరోయిన్‌గా ఎంచుకున్నారట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS