'నర్తనశాల' సినిమాతో కుర్రకారు గుండెల్లో సెక్సీ సెగలు పుట్టించింది ముద్దుగుమ్మ యామినీ భాస్కర్. నిజానికి ఈ ముద్దుగుమ్మ గతంలోనూ పలు చిత్రాల్లో నటించింది. కానీ అంతగా పాపులర్ కాలేదు.
'నర్తనశాల'లో అమ్మడు ఓ రొమాంటిక్ బీచ్ సాంగ్‌లో ఫుల్‌గా అందాలారబోసేసింది. సినిమా ప్రమోషన్స్‌లోనూ ఈ సాంగ్ బాగా ఉపయోగపడింది. దాంతో అమ్మడికి ఆటోమెటిగ్గా పాపులారిటీ వచ్చేసింది. అలాగే ఆడియన్స్‌కి ఈ బ్యూటీ అందాలు కూడా రిజిస్టర్ అయిపోయాయి. తాజాగా యామినీ భాస్కర్ 'భలే మంచి చౌక బేరమే' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ సందర్భంగా తన యాక్టింగ్ కెరీర్ గురించిన పలు విషయాలను అభిమానులతో పంచుకుంది. చిన్నతనం నండీ తనకు నటనపై ఉన్న ఆశక్తే తనను సినిమాల వైపు మొగ్గు చూపేలా చేసిందంటోంది. నటి అనిపించుకోవాలంటే, అన్ని రకాల పాత్రలూ పోషించాలంటోంది. అలాగే హీరోయిన్‌గా కెరీర్‌లో ఉన్నత స్థాయికి వెళ్లాలంటే గ్లామర్ తప్పనిసరి. సో గ్లామర్ ప్రదర్శనలో తనకు ఎలాంటి మొహమాటం లేదని చెబుతోంది. వరుస సినిమాలను ఎంచుకుని బిజీగా గడపాలని కోరిక ఏమీ లేదు కానీ, ఆలస్యమైనా మంచి కథల్ని ఎంచుకోవాలనుకుంటున్నానని యామినీ భాస్కర్ చెబుతోంది.
మారుతి కథ అందించిన ఈ చిత్రాన్ని మురశీకృష్ణ ముడిదాని తెరకెక్కిస్తున్నారు. నవీద్, 'కేరింత' ఫేం నూకరాజు ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్నారు. మారుతి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే ఈ చిత్రం అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.