గ్లామ్‌షాట్‌: క్యూట్‌ అండ్‌ హాట్‌గా 'దోచేసిందిలా'.!

By Inkmantra - March 30, 2019 - 20:30 PM IST

మరిన్ని వార్తలు

సిరి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అంటూ 'నన్ను దోచుకుందువటే' చిత్రంతో క్యూట్‌గా ఆకట్టుకున్న బ్యూటీ నభానటేష్‌. లేటెస్ట్‌గా 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాలో రామ్‌కి జోడీగా నటిస్తోంది. తొలుత ఈ బ్యూటీని చూసి గ్లామర్‌కి దూరమేమో అమ్మడు అనుకున్నారంతా. కానీ అదేం కాదనీ, 'ఐ యామ్‌ సో హాట్‌.. కావాలంటే ఇదిగో చూడండి.. అని తనలోని హాట్‌ యాంగిల్‌ని ఇలా ఎగ్జిబిషన్‌కి పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. 

 

అయితే ఇదో కాన్సెప్ట్‌ ఫోటో అంటున్నారు. 'టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌' అంటూ ఓ సేవాకార్యక్రమం నిమిత్తం విరాళాలు సేకరించేందుకు సెలబ్రిటీలు ఓ స్పెషల్‌ ఈవెంట్‌ చేస్తున్నారు. ఆ ఈవెంట్‌లో చాలా మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఆ ఈవెంట్‌ కోసమే నభా నటేష్‌ ఈ హాట్‌ డ్రస్‌లో మెరిసి, హాట్‌గా ఇంకోసారి అందరి మనసుల్ని సుతి మెత్తగా దోచేసిందిలా. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS