తెలుగులో ఘన విజయం సాధించిన చిత్రం 'ఎఫ్ 2'. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం తెలుగులో వంద కోట్లు సాధించింది. వెంకటేష్కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. దిల్ రాజు బ్యానర్‌కి అత్యధిక లాభాల్ని సంపాదిపెట్టింది కూడా ఈసినిమానే. ఎఫ్ 2ని బాలీవుడ్‌కి తీసుకెళ్తామని దిల్‌రాజు ఎప్పుడో చెప్పేశారు. ఇప్పుడు అది కార్యరూపం దాలుస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు బాలీవుడ్లో తెరకెక్కించనున్నారు. ఆ బాధ్యత బోనీ కపూర్ చేతిలో పెట్టారు.
దిల్‌రాజు, బోనీలు కలసి ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు అనీస్ బజ్మీ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ యేడాది చివర్లో ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. తమిళ, కన్నడ, మలయాళ భాషలలోనూ ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలన్న ఆలోచన ఉంది. అయితే అక్కడ కూడా దిల్ రాజు ఇదే ఫార్ములా అనుసరిస్తారా, లేదంటే అవుట్ రేట్‌కి రీమేక్ రైట్స్ అమ్మేస్తారా? అనేది చూడాలి.