నభా నటేష్‌ ఇక్కడ కూడా వదిలిపెట్టడం లేదుగా.!

మరిన్ని వార్తలు

దీపమున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి.. అనే నానుడి హీరోయిన్స్‌కి ముఖ్యంగా టాలీవుడ్‌ హీరోయిన్స్‌కి బాగా వర్కవుట్‌ అవుతుంది. ప్రజెంట్‌ ఓ మోస్తరు క్రేజ్‌లో ఉన్న నభా నటేష్‌ అదే పని చేస్తుందనిపిస్తోంది. ఓ పక్క బిగ్‌ స్క్రీన్‌పై బాగానే ఛాన్స్‌లు కొట్టేస్తోంది. దాంతో పాటు, సోషల్‌ మీడియానీ దడ దడ లాడిస్తోంది. హాట్‌ హాట్‌ ఫోటో సెషన్స్‌తో రెచ్చిపోతోంది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సక్సెస్‌ నభాకి బాగా కలిసొచ్చింది. ఆ సినిమా ఇచ్చిన ఇమేజ్‌ని అలాగే కంటిన్యూ చేసేందుకు తనదైన స్టైల్‌లో తెలివి తేటలు ప్రదర్శిస్తోంది. స్పెషల్‌గా గ్లామర్‌ ఫోటో షూట్స్‌ చేయించుకుంటూ దపదపాలుగా ఆ ఫోటోలు నెట్టింట్లో పోస్ట్‌ చేస్తోంది. తద్వారా ఫాలోవర్స్‌ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

 

లేటెస్ట్‌గా రెడ్‌ కలర్‌ డిజైనర్‌ వేర్‌లో హాట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో కిర్రాక్‌ పుట్టించిందీ జూనియర్‌ ఇలియానా. రెడ్‌ కలర్‌ రన్నింగ్‌ డిజైన్‌లో బ్యూటిఫుల్‌ గాగ్రా చోళీ ధరించి ఓ రేంజ్‌లో హొయలు పోయింది. అన్నట్లు తెలుగులోనే కాకుండా ఈ బ్యూటీ ఇతర భాషల్లోనూ అవకాశాల కోసం ట్రై చేస్తోందట. తమిళ తంబీల్నీ ఇంప్రెస్‌ చేయాలనే కోరిక ఏ మూలనో బలంగా ఉన్నట్లుంది. త్వరలోనే ఆ ముచ్చట తీర్చుకునేలానే ఉందనిపిస్తోంది. ఇకపోతే, తెలుగులో ‘సోలో బతుకే సో బెటర్‌’ అనే సినిమాలో నటిస్తోంది. సాయి ధరమ్‌తేజ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయట. త్వరలోనే వాటి వివరాలు తెలియజేస్తానని చెబుతోంది అందాల నభా నటేష్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS