ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ లోకి వెళ్లిపోయింది నభా నటేషా. ఇప్పుడు తను అవకాశాల కోసం వెదుక్కోవాల్సిన అవసరం లేదు. అవే.. నభా చుట్టూ తిరుగుతున్నాయి. `అంధాధూన్` రీమేక్ `మాస్ట్రో`లో నభా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తన కెరీర్‌లో సవాల్ విసిరిన పాత్ర అంటోంది. ఇప్పటి వరకూ గ్లామర్ డాళ్ లాంటి పాత్రల్లో మెరిసిన నభాకు కాస్తో.. కూస్తో నటించే అవకాశం `మాస్ట్రో`లోనే దక్కబోతోంది.
ఈ విషయం తానే ఒప్పుకుంది కూడా. ``అంధాధూన్ చూశా. నాకు చాలా బాగా నచ్చింది. రాధికా ఆప్టే పోషించిన పాత్ర నాకు దక్కడం నిజంగా నా అదృష్టం. తను సహజనటి. ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ అయినా పలికించేస్తారు. ఆమెతో పోటీ పడను గానీ, నాదంటూ ఓ మార్క్ చూపిస్తాను`` అని నమ్మకంగా చెబుతోంది నభా.