సూపర్ ఫాస్ట్ గా సినిమాలు తీయడంలో పూరి జగన్నాథ్ ని మించినవాళ్లు లేరు. ఎప్పుడు కథలు రాసుకుంటాడో, ఎప్పుడు హీరోల్ని ఒప్పిస్తాడో కూడా చెప్పలేం. అంత స్పీడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో `లైగర్` తీస్తున్నాడు పూరి. తదుపరి సినిమాకి హీరోని ఫిక్స్ చేసేసుకున్నాడని టాక్. ఈసారి.. నితిన్ తో ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది.
పూరి - నితిన్ కాంబినేషన్‌లో ఇది వరకు `హార్ట్ఎటాక్` వచ్చిన సంగతి తెలిసిందే. కానీ... ఆ సినిమా వర్కవుట్ అవ్వలేదు. కానీ... `ఇస్మార్ట్ శంకర్`తో పూరి ఫామ్ లోకి వచ్చేశాడు. పైగా హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా పూరితో పనిచేయడం ఓ కిక్ లా భావిస్తుంటారు హీరోలు. నితిన్ కూడా.. పూరితో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడని తెలుస్తోంది. అలా.. ఈ కాంబో వర్కవుట్ అయ్యింది. నితిన్ చేతిలో `పవర్ పేట` రీమేక్, `మాస్ట్రో` సినిమాలున్నాయి. అవి పూర్తయ్యాక.. పూరి కాంబో పట్టాలెక్కుతుంది.