మల్టీస్టారర్ల హవా నడుస్తోంది. ఇద్దరు ముగ్గురు హీరోలు కలిసి వెండి తెరని పంచుకోవడానికి రెడీ అంటున్నారు. ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలైతే.. ఇక ఏ సమస్యా ఉండదు. `మనం`లో అక్కినేని హీరోలు, `ఆచార్య`లో మెగా హీరోలూ కలిసి నటించేశారు. మరి నందమూరి హీరోలెప్పుడు నటిస్తారు? బాలయ్య, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు కలిసి సినిమా చేస్తేఎలా ఉంటుంది? త్వరలోనే ఈ ప్రశ్నకు సమాధానం దొరకబోతోందని టాలీవుడ్ టాక్.
యువ దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఓ కథని సిద్ధం చేస్తున్నార్ట. అది కూడా నందమూరి ఫ్యామిలీ హీరోలని దృష్టిలో ఉంచుకుని. ఆ టైటిల్ ఏమిటో తెలుసా..... NBK. అంటే నందమూరి బాలకృష్ణ అనుకుంటారు.కానీ కాదు. ఇందులో ఎన్. అంటే ఎన్టీఆర్. బి... అంటే బాలకృష్ణ.. కె అంటే కల్యాణ్ రామ్. అలా.. ముగ్గురు హీరోల్నీ కలిపి... ఒకే టైటిల్ లో ఇరికించేశాడు ప్రవీణ్ సత్తారు. ఎన్టీఆర్ ఎప్పటి నుంచో.. బాలయ్య బాబాయ్‌తో సినిమా చేయాలని ఉంది అంటూనే ఉన్నాడు. కల్యాణ్ రామ్ కూడా అంతే. బాలయ్య నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే.. ఈ ప్రాజెక్టు చిటికెలో ఓకే అయిపోతుంది. ఓకే అవ్వడమే కాదు.. టాలీవుడ్ ని షేక్ చేసే సత్తా.. ఈ కాంబోకి ఉంది. మరి ప్రవీణ్ సత్తారు ఈ ముగ్గురు హీరోల్ని కలిపగలడా? అంత దమ్ము ఆ కథకు ఉందా? అనేవే అసలైన ప్రశ్నలు. కాకపోతే ఆలోచన అయితే బాగుంది. గుడ్ లక్... ప్రవీణ్ సత్తారు.