హీరోగా తొలి సినిమా 'పెళ్లిచూపులు'తోనే సమ్‌థింగ్ స్పెషల్ అనిపించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత 'అర్జున్‌రెడ్డి' విజయ్ దేవరకొండ దశను మార్చేసింది. సెన్సేషనల్ స్టార్ అయిపోయాడు. 'గీత గోవిందం'తో బాక్సాఫీస్‌కి బ్లాక్ బస్టర్ హీరో అయిపోయాడు. అలా ఆయన సెన్సేషన్ సాధించాక, తమ్మున్ని కూడా రంగంలోకి దించాడు. తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా లేటెస్ట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'దొరసాని' మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.
అయితే హీరోగా డెబ్యూ సినిమాకి ఆనంద్ ఎన్ని మార్కులేయించుకున్నాడయా అంటే, యావరేజ్ మార్కులే అనే టాక్ వినిపిస్తోంది. అయితే, అనుభవం ఆటోమెటిగ్గా, ఆ మార్కుల కౌంట్ పెంచేస్తుందనే నమ్మకంతో మనోడు స్పీడు పెంచేశాడట. తొలి సినిమా టాక్‌ని పట్టించుకోకుండానే రెండో సినిమాని లైన్‌లో పెట్టేశాడనీ తెలుస్తోంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌లో ఓ కొత్త దర్శకుడు ఆనంద్ దేవరకొండతో సినిమాని తెరకెక్కించనున్నాడనీ తెలుస్తోంది. ఆ యంగ్‌స్టర్ పేరు వినోద్ అనీ ప్రచారం జరుగుతోంది.
తొలి సినిమా కోసం ఓ మోస్తరు ప్రయోగం ట్రై చేసినా, రెండో సినిమాకి మాత్రం జస్ట్ కమర్షియల్ ప్లాన్‌లో ఉన్నాడట ఆనంద్ దేవరకొండ. మస్త్ ఎంటర్‌టైనింగ్, అండ్ యూత్‌ఫుల్ సబ్టెక్ట్‌తో రానున్నాడట. కట్ చేస్తే, ఈ కాన్సెప్ట్ మన రౌడీస్టార్ విజయ్ దేవరకొండ కోసం సిద్ధం చేయబడిందనీ తెలుస్తోంది. అయితే, తమ్ముడి కోసం ఈ సబ్జెక్ట్‌ని విజయ్ త్యాగం చేశాడట. మరి విజయ్ త్యాగం తమ్ముడు ఆనంద్‌కి ఎంత మేర యూజ్ అవుతుందో చూడాలి మరి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుందట.