నాగ‌బాబు కౌంట‌ర్ ఎటాక్ మామూలుగా లేదుగా?!

మరిన్ని వార్తలు

ఓ టీవీ ఛాన‌ల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై.. ప్ర‌కాష్ రాజ్ ఘాటైన విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ నిర్ణ‌యాలు మార్చుకునే తీరు త‌న‌కు న‌చ్చ‌లేద‌ని, త‌ను ఓ ఊస‌ర‌వెల్లిలా క‌నిపిస్తున్నాడ‌ని... ప్ర‌కాష్ రాజ్ కీల‌క‌మైన వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఈరోజు ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ప్ర‌కాష్ రాజ కి దిమ్మ‌తిరిపోయే కౌంట‌ర్ ఇచ్చారు. ‘రాజకీయల్లో నిర్ణయాలు అనేకసార్లు మారుతుంటాయి. ఆ నిర్ణయాల వెనుక ఉద్దేశ్యం లాంగ్‌ టర్మ్‌లో ప్రజలకు, పార్టీకి ఉపయోగపడే విధంగా ఉంటాయి.

 

మా నాయకుడు పవన్‌ కళ్యాణ్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపడం వెనుకు విస్తృత ప్రయోజనాలు ఉన్నాయని నా నమ్మకం. ఎవరికి ద్రోహం చేశాడని ప్రతి పనికిమాలినవాడు విమర్శిస్తున్నాడు. ప్రశాష్‌ రాజ్‌ డొల్లతనం ఏంటో బీజేపీ ఎంపీ సుబ్రహ్మస్వామి డిబేట్‌లోనే అర్థం అయ్యింది. నిన్ను తొక్కి నారతీస్తుంటే మాట్లాడలేక తడబడటం నాకు ఇంకా గుర్తుంది. నీ దృష్టిలో బీజేపీ తీసుకునే నిర్ణయాలు నచ్చకపోతే విమర్శించు తప్పులేదు. మంచి చేస్తే మెచ్చుకోలేని నీ కుసంస్కారం గురించి ఏం చెప్పగలం. ఈ దేశానికి బీజేపీ, ఏపీకి జనసేన పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. నీలాంటి కుహనా మేధావులు ఎన్ని వాగినా బీజేపీ, జనసేన విజయాన్ని ఆపలేరు. బీజేపీ నేతల్ని నువ్వు ఎన్ని మాటల అన్నా వాళ్లు నిన్ను ఏమీ అనడంలేదంటే ఆ పార్టీ ప్రజాస్వామ్యానికి ఇచ్చే విలువ ఏంటో అర్థం చేసుకో.

 

నిర్మాతలని డబ్బు కోసం ఎన్ని రకాలుగా హింస పెట్టావో, డేట్స్‌ ఇచ్చి రద్దు చేసి ఎంత హింసకు గురిచేశావో అన్నీ గుర్తున్నాయి. మరోసారి పవన్‌ గురించి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు’ అంటూ కాస్త ఘాటైన ప‌ద‌జాలంతో విరుచుకుప‌డ్డారు. సినిమా న‌టుల మ‌ధ్య ఎప్పుడు మంచి వాతావ‌ర‌ణ‌మే ఉంటుంది. అదే వాళ్లు రాజ‌కీయాల్లో అడుగుపెట్టి, చెరో పార్టీ, చెరో సిద్ధాంతాన్నీ న‌మ్ముకుంటే.. ఇలాంటి వైరాలే వ‌స్తాయి. మ‌రి నాగ‌బాబు మాట‌ల‌కు ప్ర‌కాష్‌రాజ్ ఏమంటాడో? ఈ వివాదం ఎక్క‌డి వ‌ర‌కూ పోతుందో?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS