2019 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మే 23న విడుదలైన విషయం తెలిసిందే. తెలుగు దేశం పార్టీ, వైకాపా మరియు జనసేన మధ్య ఉత్కంఠగా జరిగిన త్రిముఖ పోరు లో వైకాపా ఊహించని విధంగా గెలుపు జెండా ఎగరవేసింది. అయితే జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో ముందుకు వచ్చిన జనసేన పార్టీకి మాత్రం ఘోరపరాజయం ఎదురైంది. 175 అసెంబ్లీ మరియు 25 పార్లమెంట్ స్థానాల్లో కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ స్థానం లో జనసేన గెలిచింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు చోట్ల ఊహించని విధంగా పరాజయం పొందారు. పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వచ్చి నర్సాపురం నుంచి బరిలో దిగి ఘోర పరాజయం చవి చూసారు. దీనికి పలు కారణాలు ఉన్నాయని పార్టీ కార్యకర్తలు విశ్లేషకులు చెప్పుకొచ్చారు కానీ.. కొన్ని వర్గాలు మాత్రం ఇది సినీ నటుడు 'మా' మాజీ ప్రెసిడెంట్ శివాజీ రాజా అని చెప్పుకుంటున్నారు.
2019 మార్చి లో జరిగిన 'మా' ఎన్నికల్లో నాగబాబు శివాజీ రాజా కు వ్యతిరేకంగా వ్యవహరించారని.. జీవిత, రాజశేఖర్ మరియు నరేష్ కు తన మద్దతు తెలిపి శివాజీ రాజా ఓటమికి కారణమయ్యాడని.. దానికి నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని శివాజీ రాజా ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు. నాగబాబు నర్సాపురం నుంచి పోటీ చేస్తున్నాడని తెలిసి తన పై తీవ్ర వ్యతిరేక వ్యాఖ్యలు చేసి.. దానికి ప్రతీకగాగా వైసీపీ కండువా కప్పుకుని మరీ.. నాగబాబు ఓటమికి కారణమయ్యారని పరోక్షంగా చెప్పొచ్చు.