గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మెగా బ్రదర్ నాగబాబుకూ, బాలయ్య ఫ్యాన్స్‌కీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత రేంజ్లో కౌంటర్స్ ఫైట్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. లాస్ట్ పంచ్‌తో ఈ వార్కి ఫుల్స్టాప్ పెట్టేస్తానని చెప్పిన నాగబాబు కౌంటర్ 6 లో కొంచెం ఉద్వేకం చూపించారు. ఓ వీడియో బైట్ ద్వారా బాలయ్యకు ఆయన ఫ్యాన్స్‌కూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.
ఎన్టీఆర్ కాలి గోటికి చిరంజీవి సరిపోడని బాలయ్య చేసిన వ్యాఖ్యలకు నాగబాబు ఈ కౌంటర్ ఇచ్చారు. మీకు మీ నాన్న దేవుడయితే, మాకు మా అన్నయ్య చిరంజీవి దేవుడు.. అంటూ స్టార్ట్ చేసిన నాగబాబు కౌంటర్ చివరికి మా అన్నయ్య జోలికి గానీ, మా తమ్ముడు జోలికి గానీ వస్తే ఊరుకునేది లేదు అనే వార్నింగ్‌తో ఎండ్ చేశారు. రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేసుకోండి.
కానీ పర్సనల్‌గా విమర్శిస్తే, అస్సలు ఊరుకోం అని నాగబాబు అన్నారు. అలాగే ఓ దొంగోడి కథని చెప్పి, దొంగతనం చేశాక ఆ దొంగ ఆరునెలల తర్వాత కనిపించినా వాడ్ని చితక్కొట్టి కానీ వదలం. అలాగే నేను, ఎప్పటి నుండో మీరు చేస్తున్న విమర్శలకు ఇప్పుడు స్పందించాను. ఇంతటితో మీ ఆటలు కట్టకపోతే, నా ఈ కౌంటర్లు కొనసాగుతూనే ఉంటాయి అని నాగబాబు హెచ్చరించారు.