కౌంటర్‌ ఎటాక్‌: ఇంకా ఉందంటోన్న మెగా బ్రదర్‌.!

By iQlikMovies - January 10, 2019 - 11:30 AM IST

మరిన్ని వార్తలు

బాలయ్య అని పేరు చెప్పకుండా సోషల్‌ మీడియాలో ఇన్‌డైరెక్ట్‌గా బాలయ్యని ఆడేసుకుంటున్నాడు మెగా బ్రదర్‌ నాగబాబు. ఈ దర్మిలా నాగబాబుకీ, బాలయ్య ఫ్యాన్స్‌కీ మధ్య రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. కౌంటర్‌ ఎటాక్స్‌ అంటూ నెంబరింగ్‌ ఇచ్చి మరీ రెచ్చిపోతున్నాడు నాగబాబు. అయితే లేటెస్టుగా నాగబాబు ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ఇప్పటి వరకూ డైరెక్ట్‌గా బాలయ్యను ఒక్క మాట అనలేదనీ, వల్లూరి బాలయ్య పేరు చెబితే, అది ఆయనకే అనుకున్నారు. 

 

మేలు జాతి పశువుల గురించి వీడియో పోస్ట్‌ చేస్తే అది వారినే అన్నానని అంటున్నారు. బయోపిక్కులపై వేమన పద్యం చెబితే వారికే ఆపాదించుకుంటున్నారు. తాజాగా 'ఎర్రోడి వీరగాధ' అనే షార్ట్‌ ఫిలిం రూపొందిస్తే, అది కూడా వారి గురించే అనుకుంటున్నారు. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడం ఎందుకు.? బయోపిక్కులు అంటే మీ ఒక్కరిదే కాదు, చాలా బయోపిక్కులున్నాయి. మీ బయోపిక్కులో నిజాలు లేవా.? అంటూ బాలయ్య ఫ్యాన్స్‌ని డైరెక్ట్‌గా ప్రశ్నించాడు నాగబాబు. 

 

ఎన్నిసార్లు మా ఫ్యామిలీ గురించి డైరెక్ట్‌గా మాట్లాడినా, అవమానపరిచినా స్పందించని మీడియా డైరెక్టుగా అనకున్నా, ఇప్పుడెందుకు 24 గంటలూ డిస్కషన్స్‌ పెడుతోంది.. అని మీడియాని కూడా ప్రశ్నించారు. చాలాసార్లు కౌంటర్‌ ఇవ్వాలని ఆవేశపడినా, అన్నయ్య ధర్మరాజులా అపేశాడనీ అయితే, ఈ కౌంటర్‌ ఎటాక్‌ ఇంతటితో ఆగదనీ, ఇంకో కౌంటర్‌ ఉందనీ దానికోసం ఎదురు చూస్తుండమనీ ఫ్యాన్స్‌కి చెప్పారు నాగబాబు. ఇక ఆ కౌంటర్‌ నెంబర్ 6లో నాగబాబు ఎలాంటి చురకలేస్తారో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS