నాగ‌బాబు కామెడీ షో.. షురూ!

By Gowthami - July 15, 2020 - 13:03 PM IST

మరిన్ని వార్తలు

జ‌బ‌ర్‌ద‌స్త్ కామెడీ షోతో... కుటుంబ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు నాగ‌బాబు. జ‌బ‌ర్‌ద‌స్త్ అంటే నాగ‌బాబు... నాగ‌బాబు అంటే జ‌బ‌ర్‌ద‌స్త్ అన్నంత పేరు తెచ్చుకున్నాడు. కానీ క్రియేటీవ్ డిఫ‌రెన్సెస్ వ‌ల్ల ఆ షో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు నాగ‌బాబు. ఆ త‌ర‌వాత `అదిరింది` షోని న‌డిపించ‌డానికి స‌న్న‌ద్ధం అయ్యాడు. రేటింగుల్లో జ‌బ‌ర‌ద్ ద‌స్త్ కంటే ముందుకు తీసుకెళ్లాల‌ని భావించాడు. కానీ.. అదిరిందికి అంత ఆద‌ర‌ణ దక్క‌డం లేదు.

 

అందుకే ఇప్పుడు సొంతంగా ఓ కామెడీ షో చేయాల‌ని డిసైడ్ అయ్యాడు. `మ‌న ఛాన‌ల్ మ‌న ఇష్టం` పేరుతో ఓ యూ ట్యూబ్ ఛాన‌ల్ మొద‌లెట్టాడు నాగబాబు. అందులో ఈ కామెడీ షోని ర‌న్ చేయ‌నున్నాడు. అందుకోసం కొత్త టాలెంట్ ని తీసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. జ‌బ‌ర్‌ద‌స్త్ - అదిరింది లాంటి షోనే ఇది. లీమ్ లీడ‌ర్లూ, గ్యాంగులూ.. స్కిట్లూ ఇవ‌న్నీ ఉంటాయి. వాటిని యూ ట్యూబ్ ఛాన‌ల్ లో ప్ర‌ద‌ర్శిస్తారు. ఈ షోలో చ‌క్క‌టి ప్ర‌తిభ‌ని చూపించిన‌వాళ్ల‌కు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ లో అవ‌కాశం ఇస్తాన‌ని మాటిచ్చాడు నాగ‌బాబు. మ‌రి ఆ షో ఎలా ఉంటుందో? ఎన్ని టీమ్ లు ఉంటాయో తెలియాలంటే ఇంకొన్నిరోజులు ఆగాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS