తమిళ స్టార్ హీరో సినిమాలో ఆరెక్స్ కార్తికేయ

మరిన్ని వార్తలు

యువ హీరో కార్తికేయ మొదటి సినిమా 'RX100' తోనే సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ తర్వాత కార్తికేయ నటించిన సినిమాలు ఆశించిన విజయం సాధించలేకపోయాయి. అయినప్పటికీ నిరాశపడకుండా సక్సెస్ కోసం కార్తికేయ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈమధ్య కార్తికేయ ఓ తమిళ సినిమాకు సైన్ చేసినట్టు సమాచారం.

 

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న 'వలిమై' అనే సినిమాలో ఓ కీలక పాత్ర కోసం కార్తికేయను సంప్రదించారని, పెద్ద స్టార్ హీరో సినిమా కావడంతో కార్తికేయ కూడా ఓకే చెప్పారట. ఈ విషయం అధికారికంగా ప్రకటించలేదు కానీ ఈమధ్య 'RX100' దర్శకుడు అజయ్ భూపతి ఓ హింట్ ఇచ్చారు. 'RX100' విడుదలై రెండేళ్లు కావడంతో సోషల్ మీడియాలో ట్వీట్ల హంగామా జరిగింది. అజయ్ భూపతి, కార్తికేయ ఈ విషయంపై ముచ్చటిస్తున్న సమయంలో కార్తికేయ త్వరలో ఓ తమిళ సినిమాలో నటిస్తున్నాడని హింట్ ఇచ్చారు. కార్తికేయ ఈ విషయం ఖండించకుండా ఆ విషయం వాళ్లు ప్రకటిస్తే బాగుంటుందని చెప్పారు. ఈ లెక్కన అజిత్ సినిమాలో కార్తికేయ నటిస్తున్నట్టే అనుకోవాలి.

 

ఇదిలా ఉంటే ప్రస్తుతం కార్తికేయ 'చావు కబురు చల్లగా' అనే సినిమాలో నటిస్తున్నాడు. లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో హీరోయిన్. జీఎ2 ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్టర్.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS