మగధీర తరవాత భారీ అంచనాలతో విడుదలైన రామ్ చరణ్ సినిమా ఆరెంజ్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర బోల్తా పడింది. చరణ్ అభిమానుల్ని దారుణంగా నిరాశ పరిచింది.
అయితే ఈ సినిమా అంటే... చరణ్‌కి చాలా ఇష్టం. అప్పట్లో భారీ అంచనాల మధ్య రిలీజ్ కావడంతో.. సరిగా ఆడలేదు కానీ, ఇప్పటికీ ఈ సినిమా అంటే చాలామందికి ఇష్టం. టీవీల్లో ఈ సినిమా ఎప్పుడు ప్రదర్శించినా మంచి రేటింగులు వస్తాయి. పాటలైతే సూపర్ డూపర్ హిట్. ఇటీవలే ఆరెంజ్ సినిమాకి పన్నెండేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆరెంజ్ చర్చ మరోసారి వచ్చింది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వాల్సింది కాదని, ఇప్పుడు రిలీజ్ చేసినా జనం చూస్తారన్న కామెంట్లు వినిపించాయి. ఇవన్నీ నిర్మాత నాగబాబు దృష్టికి వెళ్లాయి. అందుకే ఆయన `ఆరెంజ్`ని రీ రిలీజ్ చేసే ప్లానింగులో ఉన్నారు. ``ఆరెంజ్‌ని మళ్లీ తీసుకొస్తాం.కానీ దానికి మంచి సందర్భం కావాలి. త్వరలోనే ఈ సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది`` అని నాగబాబు క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ రిలీజ్ లో సూపర్ హిట్ అయిన సినిమాల్ని ఇప్పుడు రీ రిలీజ్ చేయడం సంప్రదాయంగా మారింది. అయితే ఫ్లాపు సినిమానీ రీ రీలీజ్ చేయడం.. ఆరెంజ్‌తో మొదలవుతుందేమో..? అదే జరిగితే.. ఇక నుంచి ఫ్లాపు సినిమాలు సైతం వరుస కడతాయి.