తెలుగు సినిమా ఇప్పుడు సరిహద్దుల్ని చెరిపేస్తోంది. ఖండాలు దాటేస్తోంది. రాజమౌళి సినిమాలు ఈ పని ఎప్పుడో చేసేశాయి. ఇప్పుడు సుకుమార్ వంతు వచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందించిన `పుష్ప` ఎంత ఘన విజయాన్ని అందుకొందో మనందరికీ తెలిసిందే. సౌత్ ఇండియాని ఓ ఊపు ఊపేసిన పుష్ప.. నార్త్ నీ దుమ్ము దులిపేసింది. బాలీవుడ్ లో అనూహ్య విజయాన్ని అందుకొంది. విదేశాల్లోనూ పుష్ప తన హవా చూపించింది. ఇప్పుడు రష్యాలోనూ విడుదల కాబోతోంది.
పుష్పని రష్యాలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రష్యన్ భాషలో అనువదించే కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. విడుదలకు ముందు ఈ సినిమాకి భారీ ఎత్తున ప్రచారం కల్పించబోతున్నారు. అందుకోసం బన్నీ సైతం రష్యాకు వెళ్లబోతున్నాడని టాక్. రష్యాలో బన్నీ హవా... ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.