నిర్మాతగా చితికిపోయిన నాగబాబుని `జబర్‌దస్త్` షో ఆదుకుంది. ఈ షోకి జడ్జిగా వ్యవహరించిన నాగబాబు.. బాగానే సంపాదించుకోగలిగారు. ఏళ్లపాటు... ఈ షోకి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అయితే ఏమైందో ఏమో... ఈ షో నుంచి నాగబాబు తప్పుకున్నారు. `జబర్ దస్త్`కి పోటీగా జీలో `అదిరింది` షో నిర్వహించారు నాగబాబు. దానికి రెస్పాన్స్ అంతంత మాత్రమే. నాగబాబు ప్లేసులో `జబర్‌దస్త్`కి ఎంత మంది జడ్జ్‌లు వచ్చినా... ఆకట్టుకోలేకపోయారు. ప్రస్తుతం మనో ఈ షోకి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఆయన కూడా త్వరలో.. జెండా ఎత్తేస్తారని తెలుస్తోంది. ఆయనకు మరో షో కన్‌ఫామ్ అయ్యిందని, అందుకే.. బబర్‌దస్త్ కి గుడ్ బై చెప్పబోతున్నార్ట.
ఆ స్థానంలో నాగబాబు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. `జబర్‌దస్త్`లో కీలక సభ్యుడైన గెటప్ శీను ఈ విషయాన్ని చూచాయిగా ధృవీకరించాడు కూడా. నాగబాబు లేని లోటు.. నాగబాబు ఈ షో నుంచి వెళ్లిపోవడం, పూర్తిగా ఆయన వ్యక్తిగతం అని, కానీ ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని, త్వరలోనే ఆయన మళ్లీ ఈ షోలోకి అడుగు పెట్టే అవకాశం వుందని చెప్పుకొచ్చాడు శ్రీను. దాంతో.. నాగబాబు రీ ఎంట్రీ దాదాపు ఖాయమైపోయిందన్న విషయం అర్థమవుతోంది. మరి అందుకు ముహూర్తం ఎప్పుడో?