నాగ‌బాబు వెన‌క్కి త‌గ్గాడు.. కార‌ణం ఎవ‌రు?

మరిన్ని వార్తలు

ఈమ‌ధ్య ట్వీట్ల‌తో తెగ హోరెత్తించాడు నాగబాబు. రోజుకో ట్వీటు. దానిపై బోలెడంత దుమారం. ఆ త‌ర‌వాత చ‌ర్చ‌లు. మొత్తానికి నాగ‌బాబుని టాక్ ఆఫ్ ది ఇండ్ర‌స్ట్రీని చేసి ప‌డేశాయి. ఇదంతా ఒక ఎత్త‌యితే, బాల‌కృష్ణ‌పై ఆయ‌న చేసిన కామెంట్లు మ‌రో ఎత్తు. ఇండ్ర‌స్ట్రీ స‌మావేశాల‌కు త‌న‌ని పిల‌వ‌లేద‌ని అలిగిన బాల‌య్య‌, ఆవేశంలో ఏదో మాట్లాడితే, ఆ వెంట‌నే వీరావేశంతో నాగ‌బాబు రియాక్ట్ అవ్వ‌డం తెలిసిన విష‌య‌మే. బాల‌య్య కామెంట్ల కంటే, నాగ‌బాబు వ్యాఖ్య‌లే ఎక్కువ దుమారం రేపాయి. అయితే ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి.

 

`బాల‌య్య‌తో త‌న‌కు ఎలాంటి గొడ‌వా లేద‌ని, అదేదో ఆవేశంలో అనుకున్న మాట‌ల‌ని, ఇక మీద‌ట బాల‌య్య‌పై కామెంట్లు చేయ‌న‌ని` నాగ‌బాబు తాజాగా వ్యాఖ్యానించ‌డం కొత్త అనుమానాల‌కు తావిస్తోంది. బాల‌య్య ఇష్యూ క్లోజ్ అయిపోయింద‌ని, ఇక దానిపై తాను మాట్లాడ‌డ‌న‌ని నాగ‌బాబు చెప్ప‌డంతో మెగా ఫ్యాన్స్ ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు. `నాగ‌బాబు ఇష్యూ గురించి నేను మాట్లాడ‌డ‌మా.. ఛీఛీ` అంటూ బాల‌య్య వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. దాంతో.. నాగ‌బాబుకి బాల‌య్య ఎంత విలువ ఇచ్చాడో అర్థ‌మైంది. నిజానికి బాల‌య్య లైట్ తీసుకోవ‌డం వ‌ల్ల ఈ వివాదం మ‌రింత ఉధృతం అవుతుంద‌ని అంతా అనుకున్నారు.

 

కానీ నాగ‌బాబు షాకింగ్‌గా సైలెంట్ అయిపోయారు. నాగ‌బాబు వెనక్కి త‌గ్గ‌డానికి కూడా బ‌ల‌మైన కార‌ణం ఉంద‌ని టాలీవుడ్ టాక్‌. నాగ‌బాబు వ‌రుస ట్వీట్లు, వివాదాల‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ సీరియ‌స్ అయ్యాడ‌ని, నాగ‌బాబుని పిలిచి క్లాసు పీకాడ‌ని టాక్‌. నాగ‌బాబు వ్యాఖ్య‌లు జ‌న‌సేన పార్టీ మెడ‌కు చుట్టుకుంటున్నాయ‌ని, అవి పార్టీ అభిప్రాయాలుగా చ‌లామ‌ణీ అవుతున్నాయ‌ని ప‌వ‌న్ భావిస్తున్నాడ‌ట‌. ఇక మీద‌ట ఏం మాట్లాడినా, ఆచి తూచి మాట్లాడాల‌ని, లేదంటే ప‌రిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయ‌ని ప‌వ‌న్ హెచ్చ‌రించిన‌ట్టు తెలుస్తోంది. అందుకే నాగ‌బాబు ఇలా సైలెంట్ అయిపోయార‌ని, వెన‌క్కి త‌గ్గార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS