నోరు అదుపులో పెట్టుకోండి: బాల‌య్య‌కు నాగ‌బాబు వార్నింగ్!

By iQlikMovies - May 28, 2020 - 18:53 PM IST

మరిన్ని వార్తలు

ఇండ్ర‌స్ట్రీలో మ‌రో వివాదం రాజుకుంది. `న‌న్నెవ‌రూ మీటింగులకు పిల‌వ‌లేదు.. అంద‌రూ క‌లిసి భూములు పంచుకుంటున్నారా..?` అంటూ నంద‌మూరి బాల‌కృష్ణ చేసిన ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. బాల‌య్య వ్యాఖ్య‌ల‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్తువెత్తున్నాయి. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు అయితే డైరెక్టుగా ఓ వార్నింగే ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి అంటూ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. బాల‌య్య మాట‌లు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌నీ, తెలంగాణ ప్ర‌భుత్వాన్నీ కించ‌పరిచేలా ఉన్నాయ‌ని, ముందు బాల‌య్య క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

 

బాల‌య్య కేవ‌లం ఓ హీరో మాత్ర‌మే అని ఆయ‌న గుర్తు చేశారు ``భూములు పంచుకోవ‌డానికి ఎవ‌రూరియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేయ‌లేదు. ఆంధ్ర ప్ర‌దేశ్‌కి వెళ్తే తెలుస్తుంది. ఆంధ్ర‌ని ఎలా నాశ‌నం చేశారో.. తెలుగు దేశం పార్టీని న‌మ్మి ఎలా మోస‌పోయారో.. మీరేం మాట్లాడినా నోరు మూసుకుని కూర్చోలేమ‌ని ఘాటుగా వ్యాఖ్యానించారు. బాల‌య్య మీడియాతో మాట్లాడుతూ ఓ బూతు కూడా వాడార‌ని, దానికి మీడియా వాళ్లు బీప్ కూడా వేశార‌ని, బాల‌య్య హ‌ద్దుల్లో ఉండి మాట్లాడ‌డం నేర్చుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. మొత్తానికి ఈ వ్య‌వ‌హారం చినికి చినికి గాలివాన‌గా మారేలానే క‌నిపిస్తోంది. దీనిపై బాల‌య్య ఏమంటారో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS