చైతు - శోభితల పెళ్లి ఎప్పుడు? ఎక్కడ?

మరిన్ని వార్తలు

నాగ చైతన్య సమంతతో విడాకులు తీసుకున్న తరవాత మళ్ళీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు. ఎవరితో రిలేషన్ లో ఉన్నాడని చర్చలు జరుగుతూ ఉండేవి. అప్పుడప్పుడు చైతు సామ్ మళ్ళీ కలిసి పోతారు అంటూ రూమర్లు కూడా పుట్టుకొచ్చేవి. అందుకే వీరిద్దరూ మళ్ళీ పెళ్లి ఆలోచనలు చేయటం లేదని కూడా వాదించేవారు. తరవాత కొన్నాళ్ళకి చైతన్య శోభిత రిలేషన్ షిప్ పై వార్తలు వచ్చాయి. ఇద్దరు డేటింగ్ చేస్తున్నారని, కలిసి ట్రిప్ లకి వెళ్లినట్లు సోషల్  మీడియాలో ఫొటోస్ దర్శనమిచ్చాయి. దీంతో సామ్, చైతు అభిమానులు అవాక్కయ్యారు. వీరిద్దరూ మళ్ళీ కలుస్తారన్న ఆశ ఆవిరి అయిపోయింది. 


నాగ చైతన్య, శోభిత రిలేషన్ షిప్ లో ఉన్నారా లేదా అన్న సంశయంలో ఉండగానే వీరి ఎంగేజ్ మెంట్ న్యూస్ తో షాకిచ్చారు. దీనితో అప్పటివరకు వీరి రిలేషన్ షిప్ గూర్చి  చర్చించిన నెటిజన్స్ ఇప్పుడు వీరి పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అని ఆరా తీస్తున్నారు. ఆగస్టు 8 న నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, కొన్నాళ్ళు ఆగి పెళ్లి చేసుకుంటారని నాగ్ అనౌన్స్ చేశారు. కానీ నెటిజన్స్ మాత్రం వీరి పెళ్లి పై తెగ ఆసక్తి చూపిస్తున్నారు. నిశ్చితార్థం సైలెంట్ గా చేసినట్లు పెళ్లి కూడా అలానే చేస్తారా లేదా, మంచి సందడిగా చేస్తారా? డెస్టినేషన్ వెడ్డింగా ? ఎక్కడ చేస్తారు అని ఆత్రంగా చూస్తున్నారు. 


ప్రస్తుతం చైతు తండేల్ మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఈ ఏడాది చివ‌రిలో కానీ వ‌చ్చే ఏడాది మార్చి నెల‌లో కానీ వీరి వివాహం జరగొచ్చని టాక్. ప్రజంట్ డెస్టినేషన్ వెడ్డింగ్ లు ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. చైతు సామ్ లది కూడా డెస్టినేషన్ వెడ్డింగే. వీరి పెళ్లి గోవాలో జరిగింది. ఇప్పుడు కూడా  చైతు డెస్టినేష‌న్ వెడ్డింగ్ కే ఓటు వేసాడని సమాచారం. చైతు శోభితల పెళ్లి వేడుకకి రాజ‌స్థాన్ లోని ఓ రిసార్ట్‌లో వేదిక కానుందని తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS