నాగ చైతన్య హీరోగా కొత్త సినిమా ప్రారంభోత్సవం ఈ రోజు హైద్రాబాద్‌లో లాంఛనంగా జరిగింది. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. 'శైలజా రెడ్డి అల్లుడు' అనే టైటిల్‌ని ఈ సినిమాకి పరిశీలిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది.
ఈ రోజు రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు లాంఛనంగా జరిగాయి. మారుతి డైరెక్షన్‌లో ఇటీవల వచ్చిన 'మహానుభావుడు' చిత్రం మంచి విజయం అందుకుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది ఈ చిత్రం. అతిశుభ్రం అనే కాన్సెప్ట్‌తో నవ్వులు పూయించాడు డైరెక్టర్ మారుతి ఈ సినిమా ద్వారా. గతంలో 'భలే భలే మగాడివోయ్' సినిమాకి మతిమరుపుతోనూ, 'మహానుభావుడు'కి అతిశుభ్రంతోనూ సక్సెస్ అందుకున్నాడు. ఈ సారి ఏ కొత్త కాన్సెప్ట్ పట్టుకొస్తాడో మారుతి చూడాలి.
'శైలజారెడ్డి అల్లుడు' అనే టైటిల్ డిఫరెంట్‌గా అనిపిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనిపిస్తుంది టైటిల్ చూస్తుంటే, అయితే ఈ టైటిల్‌పై ఇంకా అఫీషియల్‌గా క్లారిటీ రాలేదు. కానీ మారుతి అంటేనే రెగ్యులర్‌కి భిన్నంగా ఆలోచిస్తాడు. సమ్‌థింగ్ డిఫరెంట్ ఫీల్‌ని ఆడియన్స్‌కి క్రియేట్ చేస్తాడు. అలాగే ఈ సినిమాతో మారుతి ఏం మాయ చేయబోతున్నాడో చూడాలి మరి.
ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారమ్. ప్రస్తుతం చైతూ 'సవ్యసాచి' సినిమాలో నటిస్తున్నాడు. ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. పవర్ ఫుల్ పాత్రలో చైతూ కనిపిస్తున్నాడు. చందూ మొండేటి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తమిళ హీరో మాధవన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇవి కాక చైతూ, వెంకటేష్‌తో ఓ మల్టీ స్టారర్ కూడా రానుంది.