ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'కి మెగా పవర్ తోడయ్యింది అంటే అవునంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ సినిమా ఇది.
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న హిస్టారికల్ మూవీ ఇది. ఈ చిత్రం కోసం చిత్ర యూనిట్ ఇప్పటికే చరిత్రను తిరగ తోడేసింది. బోలెడంత పరిశోధనలు చేసింది. ఇంత గొప్ప స్టోరీ కాబట్టి, ఈ చిత్రంలో నటించేందుకు బాలీవుడ్ నుండీ, కోలీవుడ్ నుండే కాక మలయాళం నుండీ కూడా ప్రముఖ నటీ నటులు నటించేందుకు ముందుకొచ్చారు. బాలీవుడ్ నుండి బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుండగా, కోలీవుడ్, మాలీవుడ్ నుండి ఇతర నటీనటులు ఇతర ముఖ్య పాత్రలను పోషించనున్నారు. కాగా తాజాగా ఈ సినిమాకి మరో గ్లామర్ యాడ్ ఆయ్యింది.
అదింకెవరో కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ సినిమాకి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే బాబాయ్ పవన్‌ని చరణ్ కలిశాడట. ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం బాబాయ్‌ని నటించమని చరణ్ కోరాడట. అందుకు పవన్ కళ్యాణ్ పోజిటివ్‌గా స్పందించినట్లు సమాచారమ్. గతంలోనూ అన్నయ్య కోసం 'శంకర్‌దాదా జిందాబాద్' చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ ఫైట్ సీన్‌లో నటించాడు. అలాగే ఇప్పుడు ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలోనూ పవన్ నటించనున్నాడనీ తెలియవస్తోంది. చరణ్‌కి పవన్ తన డేట్స్ కూడా ఇచ్చినట్లు తాజా సమాచారమ్.
ఒకవేళ ఇదే నిజమైతే సినిమాకి వెయిట్ మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'అజ్ఞాతవాసి' చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్రివిక్రమ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కానుంది.