ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో చిత్రాలతో తన కెరీర్ లో ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చి అందరిని ఆకట్టుకున్న నాగ చైతన్య, ఇప్పుడొక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో మన ముందుకి రానున్నాడు.
అయితే ఆ సినిమా ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ కూడా ఉగాది సందర్బంగా విడుదల చేయనున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకి “రారండోయ్ వేడుక చూద్దాం” అనే క్యాచీ టైటిల్ పెట్టినట్టు సమాచారం. కాకపోతే అధికారికంగా ఉగాది రోజున రిలీజ్ చేయనున్నారు.
ఇదిలాఉంటే డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మాత్రం ఈ చిత్రం పైన చాలా నమ్మకంతో ఉన్నాడట. దాదాపు సగంపైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకానుంది.
అందాల తార రకుల్ ప్రీత్ ఈ సినిమాలో చెయ్ సరసన నటిస్తుంది.