ఆ గెటప్‌ రివీల్‌ అయ్యేదెప్పుడు?

మరిన్ని వార్తలు

అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం 'దువ్వాడ జగన్నాధమ్‌' ఈ సినిమాలో అల్లు అర్జున్‌ బ్రాహ్మణ యువకుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారమ్‌ ప్రకారం అల్లు అర్జున్‌ ఈ సినిమాలో రెండు గెటప్స్‌లో కనిపించనున్నాడట. ఒకటి బ్రాహ్మణ గెటప్‌ అయితే, మరోటి పవర్‌ ఫుల్‌ గెటప్‌ అట. ఆ గెటప్‌ ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచారు. అయితే ఇప్పటికే విడుదలైన టీజర్‌లో బ్రాహ్మణ గెటప్‌లో అమాయకంగా డైలాగులు చెప్తున్న అల్లు అర్జున్‌ కనిపిస్తున్నాడు. ఈ టీజర్‌తోనే సంచలనాలు సృష్టించేస్తున్నాడు అల్లు అర్జున్‌. ఈ టీజర్‌ ఇప్పటికి కోటి వ్యూస్‌ని క్రాస్‌ చేసింది యూ ట్యూబ్‌లో. కాగా మరో టీజర్‌ని త్వరలోనే రిలీజ్‌ చేయనున్నారట. ఆ టీజర్‌లో అల్లు అర్జున్‌ పవర్‌ఫుల్‌ లుక్‌ని రివీల్‌ చేయనున్నారని తెలియవస్తోంది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ముద్దుగుమ్మ పూజీ హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. టీజర్‌లో ఈ ముద్దుగుమ్మ హాట్‌ అప్పీల్‌కి ఫిదా అయిపోతున్నారు కుర్రకారు. ప్రస్తుతం హైద్రాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది ఈ సినిమా. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సమ్మర్‌లోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS