డైరెక్టర్స్ యందు శేఖర్ కమ్ముల డైరెక్షన్ వేరయా అనాలి. ఆయన తక్కువగా సినిమాలు చేస్తుంటారు. కానీ, ఫీల్ ఎక్కువగా క్రియేట్ చేస్తుంటారు. అలా ఆయన నుండి వచ్చిన 'హ్యాపీడేస్' 'లీడర్', 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్', 'ఫిదా' సినిమాలు ఒక్కో వర్గం వారిని ఒక్కో రకంగా ఆకట్టుకున్నాయి. శేఖర్ కమ్ముల నుండి లేటెస్ట్‌గా వచ్చిన 'ఫిదా' అన్ని వర్గాల వారినీ విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు, బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తదుపరి శేఖర్ కమ్ముల నుండి వస్తున్న చిత్రం ఇటీవలే అనౌన్స్‌మెంట్ జరిగింది.
లేటెస్ట్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సారి తన స్టోరీకి హీరో, హీరోయిన్లుగా అక్కినేని బుల్లోడు నాగచైతన్యను, ఫిదాతో తననే కాదు, తెలుగు ఆడియన్స్ అందర్నీ ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయిపల్లవినీ ఎంచుకున్నారు శేఖర్ కమ్ముల. అయితే, ఏ స్టోరీని వీరిద్దరి కోసం నెరేట్ చేయబోతున్నారో ఇంకా తెలీదు. కానీ, ఖచ్చితంగా క్యూట్ రొమాంటిక్ స్టోరీ ఉండబోతుందని అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.
తాజాగా ప్రారంభమైన ఈ సినిమా ఓపెనింగ్ సికింద్రాబాద్‌లో జరిగింది. ఈ సినిమాతో ఇంతవరకూ డిస్ట్రిబ్యూటర్స్‌గా ఎన్నో మంచి సినిమాల్ని, సక్సెస్‌ఫుల్ సినిమాల్ని అందించిన ఏషియన్ డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. ఇంత చక్కని కాంబినేషన్‌లో తమ తొలి చిత్రం రూపొందుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సదరు నిర్మాతలు. సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి, ఈ ఏడాది చివర్లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలో చిత్ర యూనిట్ ఉంది.