హీరోయిన్‌గా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి, దర్శకురాలిగానూ సత్తా చాటడమే కాదు, ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా విజయ నిర్మల గిన్నీస్ రికార్డుకెక్కారు. ఆమె తర్వాత ఎంతో మంది మహిళా దర్శకులు, ఆమె ఇన్సిప్రేషన్‌తోనే దర్శకత్వ రంగంలో అడుగుపెట్టినా, ఆమెలా స్టార్‌డమ్ సంపాదించుకోలేకపోయారు.
అయినా, తెలుగు ఇండస్ట్రీలో మహిళా దర్శకులు వేల మీద లెక్క పెట్టేలా మాత్రమే ఉన్నారు. జీవిత, బి.జయ, నందినీ రెడ్డి తదితరులు తెలుగులో మహిళా దర్శకులుగా కొనసాగుతున్నారు. కానీ, స్టార్‌డమ్ విషయంలో విజయనిర్మలలా వాళ్లలో ఎవరూ ఆ ఛాయలకు కూడా వెళ్లలేకపోయారు. ఈ జనరేషన్‌కి సంబంధించి, షార్ట్ ఫిలింస్ ద్వారా కొంతమంది అమ్మాయిలు దర్శకత్వంపై ఆసక్తి చూపుతున్నారు.
ఆ ఆసక్తితో డైరెక్షన్ విభాగంలో అసిస్టెంట్స్‌గా పని చేస్తున్న వారూ ఉన్నారు. నో డౌట్.. వారందరికీ విజయ నిర్మలే ఆదర్శం. అందుకే హీరో సుధీర్ బాబు విజయనిర్మల గురించి ఓ ఆసక్తికరమైన స్టేట్‌మెంట్ ఇచ్చారు. 'ఈ పురుషాధిక్య సమాజంలో దర్శకురాలిగా ఎదిగి, ఆ రేంజ్ స్టార్‌డమ్ సంపాదించుకున్న విజయ నిర్మల ప్రతీ ఒక్కరికీ ఆదర్శం..' అన్నారాయన. ఆమె మృతి పట్ల సినీ ఇండస్ట్రీ మొత్తం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఆమెలా నటి, దర్శకురాలు, నిర్మాత.. ఇలా బహు ముఖ ప్రజ్ఞాశాలి అయిన వ్యక్తి న భూతో న భవిష్యతి. అంతే.