ఓ సినిమా పూర్తయ్యాక.. దానికి రీషూట్ల పేరుతో రీపేర్లు చేయడం సర్వసాధారణమైపోయింది. నాగార్జున అయితే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. తన ప్రతీ సినిమాకీ... విడుదలకు ముందు ఇలా రీపేర్లు చేసుకోవడం అలవాటుగా మారింది. తనయుల సినిమాలొచ్చినా.... నాగ్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంటాడు.
తాజాగా 'సవ్యసాచి'కీ ఇలానే రీషూట్లు జరిగాయి. కొన్ని కీలకమైన సన్నివేశాల్ని.. క్వాలిటీ కోసం మరోసారి తెరకెక్కించారు. ఇదే విషయం చైతూని అడిగితే... ఇలా స్పందించాడు. ``రీషూట్లు చేస్తే తప్పేంటి? ఏం చేసినా బెటర్‌మెంట్ కోసమే కదా?? సినిమా బయటకు వచ్చేశాక.. ఇది చేస్తే బాగుండేది, అలా చేస్తే బాగుండేది అనుకునే బదులు చేతులో ఉండగానే తప్పులు సరిదిద్దుకుంటే మంచిది కదా.? పెద్ద పెద్ద సినిమాలు, దర్శకులు, హీరోలు రీషూట్ల ఫార్ములా ఫాలో అవుతారు. నేనూ అంతే`` అంటూ క్లారిటీ ఇచ్చేశాడు.
అయితే ఎన్ని రీషూట్లు చేసినా 'శైలజా రెడ్డి అల్లుడు' సక్సెస్‌కొట్టలేకపోయింది. అంటే.. అప్పుడప్పుడూ ఈ ఫార్ములా కూడా పనిచేయదన్నమాట.