హిట్లూ, ఫ్లాపూ మామూలే. కానీ ఫ్లాపుల్ని హీరోలు అంత తేలిగ్గా తీసుకోలేరు. అందులోంచి బయటకు రావడం చాలా కష్టం. ఆ డిప్రెషన్ లో మరిన్ని తప్పులు చేస్తుంటారు. కొంతమంది హీరోలు మాత్రం... టేక్ ఇట్ ఈజీ పాలసీ నమ్ముతారు. అందులో నాగచైతన్య ఒకడు. తన కెరీర్‌లో హిట్లూ, ఫ్లాపులూ ఉన్నాయి. వాటిని పెద్దగా పట్టించుకోకుండా.. కెరీర్‌ని ముందుకు సాగిస్తున్నాడు.
ఇటీవల తన నుంచి `థ్యాంక్యూ` వచ్చింది. ఆ సినిమాపై చైతూ చాలా నమ్మకాలు పెట్టుకొన్నాడు. చాలా కష్టపడి చేసిన సినిమా అది. మూడు గెటప్పుల్లో చైతూ కనిపించి ఆకట్టుకొన్నాడు. కానీ అది పెద్ద డిజాస్టర్ అయిపోయింది. దిల్ రాజు బ్యానర్‌లో కూడా ఇదే పెద్ద ఫ్లాప్.
ఈ సినిమా ఫ్లాప్ పై చైతూ ఇప్పుడు స్పందించాడు. ''థ్యాంక్యూ ఫలితం నిరాశ పరిచిన మాట వాస్తవమే. కానీ... అందులోంచి త్వరగా బయటకు వచ్చేశాను. చిత్రసీమలో హిట్టూ, ఫ్లాపు చాలా కామన్. తప్పులు చేస్తేనే ఎక్కువ పాఠాలు నేర్చుకోవచ్చు'' అని చెప్పుకొచ్చాడు. తాను నటించిన `లాల్ సింగ్ చద్దా` గురువారం విడుదలైంది. ఈ సినిమాలో చైతూ పాత్ర చిన్నదే. కాకపోతే అమీర్ ఖాన్ సినిమా కాబట్టి.. ఈ సినిమాతో తన మైలేజీ పెంచుకొనే ఛాన్సుంది. అందుకే చైతూ కూడా ఈసినిమా చేయడానికి ఒప్పుకొన్నాడు.