రెట్రో లుక్‌.. హ్యాపీ బర్త్‌డే చైతూ

By iQlikMovies - November 23, 2018 - 10:54 AM IST

మరిన్ని వార్తలు

అక్కినేని నాగచైతన్యకి రెట్రో లుక్‌ అంటే ఎంత ఇష్టమో.! '100 పర్సంట్‌ లవ్‌' సినిమా కోసం ఓల్డ్‌ లుక్‌ వచ్చేలా ఓ పాటలో కన్పించాడు నాగచైతన్య. ఆ తర్వాత 'మనం' సినిమా కోసం ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌లో 'రెట్రో' లుక్‌ ట్రై చేసిన చైతూ, ఇటీవల నటించిన 'సవ్యసాచి' సినిమాలో కూడా ఓ పాట కోసం రెట్రో లుక్‌లో కనిపించిన సంగతి తెల్సిందే. 

లేటెస్ట్‌గా తన కొత్త సినిమా కోసం మళ్ళీ రెట్రో లుక్‌లో కన్పించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. నేడు అక్కినేని నాగచైతన్య పుట్టినరోజు. ఈ నేపథ్యంలో నాగచైతన్య కొత్త సినిమా లుక్‌ బయటకు వచ్చింది. పాత వెస్పా స్కూటర్‌ మీద చైతూ, రెట్రో లుక్‌తో కనిపించాడు. శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెల్సిందే. నాగచైతన్య సరసన అతని సతీమణి సమంత నటిస్తోన్న సినిమా ఇది. చైతూ, సమంత కాంబినేషన్‌లో ఇది నాలుగో సినిమా కావడం గమనార్హం. 

ఈ సినిమాకి 'మజిలి' అనే టైటిల్‌ పరిశీలనలో వుంది. సినిమా షూటింగ్‌ 40 శాతానికి పైగా పూర్తయ్యిందట. సమంత, నాగచైతన్య ఈ సినిమాలో భార్యాభర్తలుగా నటిస్తున్నారట. ఇంట్రెస్టింగ్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోందనీ, చైతూ, సమంత కెమిస్ట్రీ ఈ సినిమాకే హైలైట్‌ అనీ విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. 

ఇదిలా వుంటే, ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటోన్న నాగచైతన్యకి, సోషల్‌ మీడియాలో బర్త్‌ డే విషెస్‌ పోటెత్తుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు నాగచైతన్యకి బర్త్‌ డే విషెస్‌ అందిస్తున్నారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS