చై శామ్‌ 'మజిలీ'లో సస్పెన్స్‌ అదే.!

By iQlikMovies - October 06, 2018 - 14:51 PM IST

మరిన్ని వార్తలు

రియల్‌ లైఫ్‌ భార్యా భర్తలైన నాగచైతన్య, సమంత పెళ్లి తర్వాత తొలిసారిగా స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. రీల్‌ లైఫ్‌లోనూ భార్యాభర్తలుగా కనిపించనున్నారు ఈ సినిమాలో చై - శామ్‌. 'నిన్ను కోరి' డైరెక్టర్‌ శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'మజిలీ' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. 

ఇదో ఫ్యామిలీ డ్రామానే కాదు, హారర్‌ అంశాలున్న థ్రిల్లింగ్‌ మూవీ. భార్యా భర్తల మధ్య ఉన్న అనుబంధాన్ని తెరపై చూపిస్తూనే, కొన్ని హారర్‌ అంశాలను కూడా కథకు అనుకూలంగా జోడించడం జరిగిందట. ఆ హారర్‌ అంశాల్లో చై, శామ్‌ నటన అత్యద్భుతంగా ఉండబోతోందని తెలుస్తోంది. 'రాజుగారి గది 2', 'యూటర్న్‌' చిత్రాలతో సమంత ఆల్రెడీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌ల్లో నటించింది. అయితే చైతూకి మాత్రం ఈ కాన్సెప్ట్‌ కాస్త కొత్తే అని చెప్పాలి. 

పెళ్లి తర్వాత భర్తతో కలిసి నటిస్తున్న సినిమా ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ కావడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని చెబుతోంది సమంత. ఈ కథలో ఊహించని మలుపులు, ట్విస్టులు చాలా చాలా ఉంటాయట. ఆల్రెడీ సెట్స్‌పై ఉన్న ఈ సినిమా షూటింగ్‌లో చైతూ, శామ్‌ మాత్రం వచ్చే వారం నుండి పాల్గొననున్నారు. వెకేషన్‌ నిమిత్తం విదేశాల్లో ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేసిన చైతూ, శామ్‌ ఫ్రెష్‌గా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. 

మరోవైపు త్వరలోనే 'సవ్యసాచి' సినిమాతో చైతూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇదో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీ. ఈ సినిమాలో చైతూకి జోడీగా నిధి అగర్వాల్‌ నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS