వీర రాఘవుడి కోసం 'అరవింద' ఏమన్నదంటే.!

మరిన్ని వార్తలు

'అరవింద సమేత వీర రాఘవ' చిత్రంలో అరవింద పాత్ర పోషిస్తోంది ముద్దుగుమ్మ పూజా హెగ్దే. కొన్ని కారణాల వల్ల ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి పూజా హెగ్దే రాలేకపోయింది. అరదుకే తాజాగా ఓ వీడియో బైట్‌ రిలీజ్‌ చేసి, తనదైన ప్రత్యేక శైలిలో సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంది.

 

ఎన్టీఆర్‌ మంచి నటుడు. ఆయన ఈజ్‌ని అందుకోవడం ఎవ్వరి వల్లా కాదని ఎన్టీఆర్‌ని పొగడ్తలతో ముంచెత్తేసింది. ఆయనతో కలిసి డాన్స్‌ చేసినప్పుడు తనకి చాలా భయం వేసిందనీ పూజా చెబుతోంది. ఎన్టీఆర్‌ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్ని ఎమోషన్స్‌ అయినా, ఒకటి రెండు షాట్స్‌కే కంప్లీట్‌ చేస్తాడని గతంలోనూ చాలామంది ఆయనతో పని చేసిన వారు చెప్పిన సందర్భాలున్నాయి. అక్టోబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న 'అరవింద సమేత..' చిత్రం ఎన్టీఆర్‌ కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా అభివర్ణిస్తున్నారు. 

త్రివిక్రమ్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్న ఎన్టీఆర్‌కి ఈ సినిమా ద్వారా ఆ అవకాశం వచ్చింది. ఇదో ఫ్యాక్షన్‌ ఎమోషనల్‌ డ్రామాగా ట్రైలర్‌ని బట్టి తెలుస్తోంది. ఇంతవరకూ ఎన్టీఆర్‌ 27 సినిమాల్లో తన నటనా ప్రతిభను చూపించాడు. అయితే ఈ సినిమాలో కొత్త ఎన్టీఆర్‌ని త్రివిక్రమ్‌ చూపించబోతున్నాడట. అభిమానులు, అభిమానేతరులు కూడా 'అరవింద..' కోసం ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

ఈ ఏడాది 'రంగస్థలం' వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత వస్తోన్న పెద్ద చిత్రమిదే కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ఇంతవరకూ విడుదలైన ప్రచార చిత్రాలతో 'అరవింద సమేత..'కు ఓ రేంజ్‌లో పోజిటివ్‌ వైబ్స్‌ క్రియేట్‌ అయ్యాయి. చూడాలి మరి వీర రాఘవుడి నట విశ్వరూపం ఎలా ఉండబోతోందో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS