చై - శామ్‌, అవునా.! ఇది నిజమేనా.?

మరిన్ని వార్తలు

అక్కినేని అందాల జంట చై, శామ్‌ కాపురంలో గొడవలు మొదలయ్యాయట. అదేంటీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా. ఇంతలోనే గొడవలా.? అని ఆశ్చర్యకపోకండి. 

ఇది రియల్‌ లైఫ్‌ గొడవ కాదు. రీల్‌ లైఫ్‌ గొడవ. అవును పెళ్లి తర్వాత చైతన్య, సమంత తొలిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నారు 'మజిలీ' చిత్రం కోసం. 'నేను లోకల్‌' ఫేం శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకుడు. కాగా ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఫాస్ట్‌గా జరుగుతోంది. హైద్రాబాద్‌ శివార్లలో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ కొన్ని బయటికి వచ్చాకి. ఈ సినిమాలో చైతూ, శామ్‌ రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్స్‌నే పోషిస్తున్నారు. 

భార్యభర్తల మధ్య వచ్చే సాధారణ గొడవలు చిలికి చిలికి గాలివానై ఎంతటి తీవ్ర పరిణామాలకు దారి తీశాయో ఈ సినిమా ద్వారా చూపించనున్నారు డైరెక్టర్‌ శివ నిర్వాణ. అయితే ఈ గొడవలకు కాస్త హారర్‌ టచ్‌ ఇచ్చారట. దాంతో స్టోరీపై మరింత ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ అయ్యింది. చై, శామ్‌ దంపతుల్లా నటిస్తున్న ఈ హారర్‌ థ్రిల్లర్‌ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. అయితే రీల్‌ లైఫ్‌లోనే వీరి కాపురంలో గొడవలు కానీ, రియల్‌ లైఫ్‌లో చాలా అన్యోన్యంగా ఉంటారట. ఆ విషయాన్ని ఎప్పటికప్పుడే సమంత సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకుంటునే ఉంది. 

ఇకపోతే చైతూ 'సవ్యసాచి'తో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS