విజయ్ సినిమాలు ఎప్పుడూ ఇంతే. బాలేదు.. అనే టాక్ వస్తే ఓ మోస్తరు వసూళ్లు వస్తాయి. పర్లేదు.. అంటే మంచి వసూళ్లు సాధిస్తాయి. బాగుంది కానీ.. అనే టాక్‌కి వసూళ్లు ఇంకా బాగుంటాయి. 'సర్కార్' సినిమా విడుదలయ్యాక మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఆ టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్లు కొల్లగొడుతోంది.
రెండు రోజుల్లోనే వంద కోట్ల మార్క్ దాటిన 'సర్కార్', నాలుగు రోజులకు 150 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఈరోజు, రేపు వీకెండ్. అంటే వసూళ్ల ప్రభంజనమే. మామూలుగా అయితే సర్కార్ వసూళ్లు నీరసించిపోవాలి. కానీ సినిమాపై తలెత్తిన రాజకీయ వివాదం ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. దర్శకుడు మురుగదాస్‌పై కేసులు, సినిమాకి వ్యతిరేకంగా ఆందోళనలు ఇవన్నీ సర్కార్ అభిమానుల్ని రెచ్చగొట్టేస్తునాయి. దాంతో చూసిన సినిమాని అభిమానులు మళ్లీ మళ్లీ చూసేస్తున్నారు.
వివాదాస్పద సన్నివేశాలు ఏమున్నాయని తెలుసుకోవడానికి హేటర్స్ కూడా సినిమా చూస్తున్నారు. చిత్రంగా తెలుగులో డల్ అయిపోయిన సర్కార్ పుంజుకుంది. ఎలా చూసినా సర్కార్‌కి తిరుగే లేకుండా పోతోంది. ఇది బహుశా సర్కార్ టీమ్ కూడా ఊహించని విజయమేమో. దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా, ఆ వాతావరణం సర్కార్‌కి ఇంకా బాగా కలిసొచ్చింది.
'ఓటు హక్కు' ప్రాముఖ్యతను తెలియజేసేలా ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు. కీర్తిసురేష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.