నాగచైతన్య హీరోగా నటించిన 'శైలజారెడ్డి అల్లుడు' సినిమా ఆగస్టు 31న విడుదల కావల్సి ఉంది. అయితే కేరళ వరదల కారణంగా ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాని సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచన చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. అది కూడా సెప్టెంబర్ 13న.
అయితే ఇక్కడే ఓ ట్విస్ట్. అదే రోజు సమంత నటించిన 'యూ టర్న్' చిత్రం రిలీజ్ కానుంది. అఫీషియల్‌గా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ అయ్యింది. సో అదే రోజు ఈ ఇద్దరి సినిమాలూ రిలీజ్ అయితే ఎలా? అనే ఆలోచన ఉంది. కానీ 'శైలజారెడ్డి'ని మరింత ఆలస్యం చేయడం మంచిది కాదని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట. మరోవైపు సమంత, చైతూ కూడా ఈ వార్‌కి సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
ఆల్రెడీ సమంత 'యూటర్న్' చిత్రం విడుదల తేదీని పోస్టర్‌తో సహా విడుదల చేసేశారు. అలా అని చైతూ కూడా అస్సలు వెనక్కి తగ్గే ప్రశక్తి లేదంటున్నాడని తెలుస్తోంది. అంటే ఈ ఇద్దరూ ఒకే రోజు పోటీ పడడం తప్పదేమో అనిపిస్తోంది. అయినా ఈ రెండు సినిమాల జోనర్స్ క్వైట్ ఆపోజిట్. సమంత 'యూటర్న్' సస్పెన్స్ థ్రిల్లర్ కాగా, చైతూ 'శైలజారెడ్డి అల్లుడు' ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సో రెండు సినిమాలూ క్లాష్ అయ్యే అవకాశమే లేదు. కానీ ఎంతో కొంత ఎఫెక్ట్ చైతూకే ఉంటుంది.
వరుస విజయాలతో దూకుడు మీదున్న సమంత లీడ్ రోల్‌లో వస్తున్న 'యూటర్న్' సినిమాపై భారీగా అంచనాలున్నాయి. అలా అని చైతూని తక్కువంచనా వేయడానికి లేదు. మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. మారుతి కూడా వరుస సక్సెస్‌ల్లోనే ఉన్నాడు. సో ఏ రకంగా చూసినా, ఈ ఇద్దరి మధ్యా వార్ స్ట్రాంగ్‌గానే ఉందనిపిస్తోంది. చూడాలి మరి, ఈ వార్‌లో ఎవరి దారి వారిదే అవుతుందో లేక జయాపజయాలు నమోదవుతాయో.!