మోస్ట్‌ బిజీయెస్ట్‌ మెగాహీరో అతనే.!

మరిన్ని వార్తలు

'ముకుందా' సినిమాతో మెగా కాంపౌండ్‌ నుండి హీరోగా పరిచయమై సినిమా సినిమాకీ వేరియేషన్‌ చూపిస్తూ, సరికొత్త శైలిలో హీరోగా సినిమాలు చేస్తున్న మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ ప్రస్తుతం మెగా కాంపౌండ్‌కే కాదు, యంగ్‌ హీరోస్‌ అందరిలోనూ బిజీగా గడుపుతున్నాడు. ఎట్‌ ఏ టైమ్‌ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు సెట్స్‌పై ఉండగానే మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టేశాడు. 

'ఘాజీ' సినిమాతో డైరెక్టర్‌గా కొత్త టాలెంట్‌ని పరిచయం చేసిన యంగ్‌స్టర్‌ సంకల్ప్‌రెడ్డితో 'అంతరిక్షం' సినిమాలో వరుణ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వెంకటేష్‌తో 'ఎఫ్‌ 2 - ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌'లో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలూ ఒకదానికొకటి పూర్తిగా విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్నాయి. అలాగే నక్కిన త్రినాధరావు డైరెక్షన్‌లో మరో సినిమా చేయబోతున్నాడు వరుణ్‌తేజ్‌. ఇదో డిఫరెంట్‌ రొమాంటిక్‌ డ్రామా అని తెలుస్తోంది. అలాగే యాక్షన్‌ మిళితమైన స్టోరీ అని తాజాగా అందుతోన్న సమాచారమ్‌. 

యాక్షన్‌ కటౌట్‌ అయినప్పటికీ, ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్‌ రోల్‌లో వరుణ్‌ ఇంతవరకూ నటించలేదు. 'కంచె' సినిమాలో సైనికుడిగా వరుణ్‌తేజ్‌ చేసిన యాక్షన్‌ సీక్వెన్సెస్‌కి ప్రత్యేకత ఉంది. కానీ ఈ సినిమాలో యాక్షన్‌ మరోలా ఉండబోతోందట. అలాగే విలక్షణ చిత్రాల దర్శకుడు సాగర్‌ చంద్ర దర్శకత్వంలో వరుణ్‌ మరో చిత్రం చేయబోతున్నాడు. 

ఇది కూడా విభిన్న కథాంశమే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా వరుసపెట్టి సినిమాలు చేస్తూనే, మూస కథలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ, సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్నాడు మెగాప్రిన్స్‌. ఎంతైనా మెగా ప్రిన్స్‌ కదా. అంతే మరి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS