అక్కినేని వారి విందు - మహా కనువిందు

మరిన్ని వార్తలు

పాపులర్‌ లవ్‌ బర్డ్స్‌ సమంత - నాగ చైతన్యలు అక్టోబర్‌ 6వ తేదీన వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇరువైపు పెద్దల అంగీకారంతో వీరి వివాహం పరిమిత సన్నిహితులు, బంధువుల మధ్య గోవాలో ఘనంగా జరిగింది. ఈ వివాహం ఇటు అక్కినేని కుటుంబ సభ్యులు, దగ్గుబాటి కుటుంబ సభ్యుల మధ్య సమంత, నాగ చైతన్యల అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది.  

ఆ తర్వాత వీరిద్దరూ షూటింగ్స్‌లో బిజీ అయిపోవడం జరిగింది. తాజాగా ఆదివారం వీరి వివాహ రిసెప్షన్‌ని హైద్రాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. అక్కినేని కుటుంబ సభ్యులు, దగ్గుబాటి కుటుంబ సభ్యులు ఈ వేడుకను సంబరంగా ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి, డైరెక్టర్‌ రాజమౌళి, సూపర్‌ స్టార్‌ కృష్ణ దంపతులు సహా పలువురు అతిరధ మహా రధులు హాజరయ్యారు. ఈ వేడుక సింప్లీ సూపర్బ్‌గా జరిగింది. స్పెషల్‌గా డిజైన్‌ చేసిన రిసెప్షన్‌ దుస్తుల్లో సమంత మెరిసిపోయింది. 

మరో పక్క సమంత తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. అలాగే నాగ చైతన్య కూడా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో చైతూ 'సవ్యసాచి' సినిమాలో నటిస్తున్నాడు. ఇవి కాక మేనమామ వెంకటేష్‌తో ఓ మల్టీ స్టారర్‌ సినిమాలో నటిస్తున్నాడు. కాగా ఇటీవలే 'రాజుగారి గది - 2', 'అదిరింది' సినిమాలతో ముద్దుగుమ్మ సమంత ప్రేక్షుకుల ముందుకొచ్చింది. మంచి విజయాన్ని అందుకుంది. మహానటి సావిత్రి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న 'మహానటి' సినిమాలో సమంత నటిస్తోంది. కీర్తి సురేష్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తున్న ఈ సినిమాలో సమంత కీలక పాత్రలో నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS