తమిళనాట కాంట్రవర్సీకి కేర్ అఫ్ అడ్రస్ గా పేరుపొందిన హీరో శింబు మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలుచున్నాడు.
అయితే ఈ సారి ఏకంగా అతను పాడిన పాట కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టు వార్తలు వెలువడడంతో ఈయన పాడిన పాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే, కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు, GST వల్ల సామాన్య జనం ఎదురుకున్న కష్టాలని కపిలన్ అనే రచయత ఒక పాట రూపంలో కూర్చడం జరిగింది.
ఆ పాటని శింబు ఆలపించడం అదికాస్తా ఇప్పుడు తమిళనాట మొత్తం వైరల్ అవ్వడం పెద్ద చర్చనీయంశంగా మారింది. అయితే దీని పైన స్పందించిన శింబు మాత్రం, తాను ఒక గాయకుడిగా పాటకి న్యాయం చేకుర్చాను అని చెప్పాడు.
మొత్తానికి బీప్ సాంగ్ తో జనం చేత చీత్కారాలు ఎదురుకున్న శింబు ఇప్పుడు ఈ కొత్త పాటతో తన ఇమేజ్ ని పెంచుకునే పనిలో పడ్డాడు.