'సవ్యసాచి' తక్కువేం కాదు.!

By iQlikMovies - March 28, 2018 - 08:00 AM IST

మరిన్ని వార్తలు

మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో రూపొందుతోన్న నాగచైతన్య సినిమా 'సవ్యసాచి'. ఇదే బ్యానర్‌లో రామ్‌చరణ్‌తో 'రంగస్థలం' సినిమాను రూపొందిస్తున్నారు. అయితే చైతూ 'సవ్యసాచి' విషయంలో కూడా ఏమాత్రం రాజీపడకుండా ఈ సంస్థ సినిమాను రూపొందిస్తోంది. బడ్జెట్‌ పరంగా చైతూ కెరీర్‌లోనే ఎక్కువ బడ్జెట్‌ మూవీ అట 'సవ్యసాచి'. యాక్షన్‌ సీన్స్‌, లొకేషన్స్‌ చాలా డిఫరెంట్‌గా చూపించనున్నారట.

 

'ప్రేమమ్‌'లో చైతూని మూడు డిఫరెంట్‌ షేడ్స్‌లో చూపించిన చందూ మొండేటి ఈ సినిమాలో చైతూని సరికొత్త లుక్‌లో చూపించనున్నాడట. ఇవన్నీ కలగలిసి 'సవ్యసాచి'పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ మధ్య చైతూకి టైం కూడా బాగానే కలిసొస్తోంది. 'ప్రేమమ్‌', 'సాహసం శ్వాసగా సాగిపో', 'రారండోయ్‌ వేడుక చూద్దాం' చిత్రాలతో వరుస హిట్లు అందుకున్నాడు. ఆ తర్వాత ఈ సక్సెస్‌ని 'యుద్ధం శరణం'తో కంటిన్యూ చేయలేకపోయినా, ఈ సారి 'సవ్యసాచి'తో కంటిన్యూ చేయడం పక్కా అంటున్నారు. 'ప్రేమమ్‌' వంటి అద్భుతమైన సక్సెస్‌ని అందించిన డైరెక్టర్‌ చందూ మొండేటి, ఈ సినిమా కోసం డిఫరెంట్‌ స్క్రిప్ట్‌ ప్రిపేర్‌ చేశాడు. 

ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్‌తో సినిమాపై అంచనాలు పెంచేశాడు. తమిళ హీరో మాధవన్‌ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మాధవన్‌కిది తొలి స్ట్రెయిట్‌ తెలుగు సినిమా కావడం విశేషం. 'ఎంసీఏ'తో హిట్‌ కొట్టిన సీనియర్‌ నటి భూమిక ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో నటిస్తోంది. ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతోంది. 

సమ్మర్‌లోనే ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS