రెండు నెలల గ్యాప్‌లో దూసుకొస్తానంటోన్న అక్కినేని బుల్లోడు

By iQlikMovies - August 09, 2018 - 11:17 AM IST

మరిన్ని వార్తలు

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. అనుకున్న బడ్జెట్‌ కన్నా ఎక్కువ బడ్జెట్‌ ఖర్చవ్వడం, నిర్మాణానంతర పనుల్లో జాప్యం కారణంగా సినిమా విడుదల ఆలస్యం కావస్తోంది. 

ఈ లోగా ఆ తర్వాత సెట్స్‌ మీదికెళ్లిన 'శైలజారెడ్డి అల్లుడు' సినిమా విడుదలకు సిద్ధమైంది. ఆగష్టు 31న 'శైలజారెడ్డి' అల్లుడు ప్రేక్షకుల ముందుకు రానుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తోంది. దిల్‌రాజు బ్యానర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రం ఫుల్‌ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. 

ఇకపోతే 'సవ్యసాచి' విషయానికి వస్తే, ఈ సినిమాలో నాగ చైతన్య ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తున్నాడు. 'సవ్యసాచి' అంటే రెండు చేతుల్ని సమానంగా ఉపయోగించేవాడు అని అర్ధం. టైటిల్‌కు తగ్గట్లుగా ఈ సినిమాలో హీరో కూడా అదే పని చేస్తాడు. అయితే భారతంలో అర్జునుడు ఆ పనిని సమర్ధవంతంగా చేస్తాడు. కానీ మన సినిమాలో హీరో చైతూ మాత్రం అర్జునుడంత సమర్ధవంతంగా చేయలేడు. ఎందుకంటే ఆయన కుడిచేయి ఆయన ఆధీనంలో ఉండదు. ఎప్పుడు అది పని చేయడం మానేస్తుందో అతనికే తెలీదు. అలాంటి ఓ భిన్నమైన పాత్రలో చైతూ నటిస్తున్నాడు. వెరీ ఇంట్రెస్టింగ్‌ కాన్సెప్ట్‌. తమిళ హీరో మాధవన్‌ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సీనియర్‌ నటి భూమిక మరో కీలక పాత్ర పోషిస్తోంది. కొత్త భామ నిధి అగర్వాల్‌ చైతూకి జోడీగా నటిస్తోంది. 

ఈ సినిమాని నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంటే రెండు నెలల గ్యాప్‌లో ఈ రెండు సినిమాలతోనూ చైతూ సందడి చేయనున్నాడన్న మాట.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS