'గూఢచారి' సినిమా చాలా బావుందని సూపర్‌స్టార్ మహేష్ సోషల్ మీడియాలో స్పందించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శోభితా ధూళిపాళ్ల రెస్పాండ్ అయ్యింది.
సూపర్‌స్టార్‌కి 'థాంక్యూ' చెప్పింది సోషల్ మీడియాలో. అయితే మహేష్ అంతటోడికి ఉత్తి థాంక్యూ చెబుతావా? 'థాంక్యూ సర్' అనాలి అని నెటిజన్లు అనిపించుకునే మహేష్ ఫ్యాన్స్ ఆమెపై దుమ్మెత్తి పోస్తున్నారు. పచ్చి బూతులతో ఆమెని దారుణంగా ఆటాడేసుకుంటున్నారు. థాంక్స్ అన్న పదమే ఓ పొలైట్ పదం. ఆ పదంలోనే రెస్పెక్ట్ ఉంది. అలాంటిది ఈ చిన్న విషయంలో సోషల్ మీడియాలో అంత ఘోరంగా స్పందించడం విస్తుపోయే విషయమే.
సినిమా బావుంది. బావుందన్న తన ఒపీనియన్‌ని సూపర్‌స్టార్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందుకు చిత్ర యూనిట్ స్పందిస్తుందా? లేదా? థాంక్స్ చెబుతుందా? లేదా? అని ఆలోచించి చెప్పిన మాట కాదది. అసలు పట్టించుకునే అంశమూ కాదది. ఒకవేళ థాంక్స్ చెప్పినా మహేష్ లాంటి హీరోలు దాన్ని రిసీవ్ చేసుకోగలిగే సిట్యూవేషన్‌లో ఉండరు. అలాంటిది శోభితా దూళిపాళ్లపై సోషల్ మీడియాలో నడుస్తున్న ఈ రచ్చ అర్ధం పర్ధం లేనిది.
మంచి విషయాల కోసం నెటిజన్లు ఇంత అత్యుత్సాహం చూపితే, అది సోషల్ అవేర్‌నెస్‌కి పనికొస్తుంది. అంతేకానీ, ఇలాంటి అర్ధం పర్ధం లేని విషయాలకు అర్ధం లేని రీతిలో చేతికొచ్చినట్లుగా బూతులు రాసేయడం మహేష్ ఫ్యాన్స్‌కి సబబు కాదు.