ఒకే పాత్ర కోసం పోటీపడుతున్న ఇద్దరు అక్కినేని హీరోలు

By iQlikMovies - June 27, 2018 - 17:32 PM IST

మరిన్ని వార్తలు

ఒక ప్రతిష్టాత్మక చిత్రంలో ఒక కీలక పాత్ర చేయడానికి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోలు పోటీపడుతుండడం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయింది. ఇంతకి ఆ హీరోలు ఎవరంటే- నాగ చైతన్య & సుమంత్.

ఈ ఇద్దరు హీరోలని ఎన్టీఆర్ బయోపిక్ లో అక్కినేని నాగేశ్వరరావు పాత్ర కోసం అడుగుతున్నారట! అయితే ముందుగా యువ హీరో నాగ చైతన్యని అనుకోవడం దానికి ప్రత్యేక కారణం ఏంటంటే- మహానటి చిత్రంలో నాగేశ్వరరావుగా చైతు నటించడమే. ఇక ఇప్పుడు మరోసారి చైతుని ఆ పాత్రకి చేయించడం కన్నా అదే కుటుంబానికి చెందిన సుమంత్ తో చేయిస్తే ఎలా ఉంటుంది అని మరో ఆలోచన కూడా వచ్చిందట.

 

దీనితో ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరితో ఆ పాత్ర చేయించాలి అన్న సందిగ్దంలో దర్శక-నిర్మాతలు పడినట్టుగా సమాచారం. అయితే ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన కీలక నిర్ణయాలు బాలయ్య తీసుకుంటాడు కాబట్టి, ఈ నిర్ణయం కూడా ఆయనకే వదిలేసినట్టు తెలుస్తుంది.

ఇది సంగతి... ఈ ఇద్దరిలో ఒకరు ఏఎన్నార్ గా కనిపించనున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS