ప్రముఖ హేతువాది అయిన బాబు గోగినేని పైన మాదాపూర్ పోలీసు స్టేషన్ లో సుమారు 13 సెక్షన్ల క్రింద కేసు నమోదయింది.
ఇంతకి ఆయన పై మోపబడిన అభియోగాలు ఏంటంటే- సౌత్ ఏషియన్ హ్యుమనిస్ట్ అసోసియేషన్ పేరిట నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొనేవారి వద్ద నుండి ఆధార కార్డు వివరాలు సేకరించి దానిని విదేశాలకు చేరవేస్తున్నారు అని. ఇది ఆధార్ నిబంధనలకి వ్యతిరేకం కాగా ఈ సంస్థకి ఆయన ఫౌండర్ గా ఉండడంతో ఈయన పైన దేశద్రోహం కేసు నమోదు చేయబడింది.
అదే సమయంలో ఆయన సోషల్ మీడియా లో తన వీడియోల ద్వారా మతాల పైన విద్వేషం కలిగించేలా మాట్లాడాడు అని కూడా ఆ అభియోగా పత్రాల్లో పేర్కొనడం జరిగింది. అయితే బాబు గోగినేని పైన ఈ ఫిర్యాదు చేసింది వీర నారాయణ అనే వ్యక్తి. ముందుగా వీర నారాయణ ఈ అభియోగాలతో కోర్టుని ఆశ్రయించగా వారు మాదాపూర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేయవలసిందిగా ఆదేశించారు.
మరి ఈ కేసు విచారణ జరగాలన్నా ఈ ఆరోపణలకి బాబు గోగినేని సమాధానం చెప్పాలన్నా కూడా ఆయన ముందుగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి రావాలి. మరి ఆయన వచ్చేవరకు పోలీసులు వేచి చూస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.