రేణూ దేశాయ్‌ని అంతలా వేధించారా?

By iQlikMovies - June 27, 2018 - 12:55 PM IST

మరిన్ని వార్తలు

పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణూదేశాయ్‌ ట్విట్టర్‌కి గుడ్‌బై చెప్పేసింది. ఇందుకు కారణం ట్విట్టర్‌ వేదికగా రేణూదేశాయ్‌ ఎదుర్కొంటున్న వేధింపులే. అయితే రేణూదేశాయ్‌కి సోషల్‌ మీడియాలో వేధింపులు కొత్తేం కాదు, కానీ ఇంతకు ముందెప్పుడూ ఆ వేధింపులకు రేణూ భయపడలేదు. ఎలాంటి వేధింపులైనా ధైర్యంగా ఎదుర్కొంది. ఎప్పటికప్పుడే అభిమానులు పేరు చెప్పి, యాంటీ ఫ్యాన్స్‌ ఆమెపై నెగిటివ్‌ కామెంట్స్‌ చేసేవారు ఎప్పటికప్పుడే వాటిని ఎంతో చాకచక్యంగా ఎదుర్కొంటూ వచ్చింది రేణూ దేశాయ్‌. 

అయితే తాజా పరిణామాల దృష్ట్యా ఆమె ట్విట్టర్‌ నుండి పూర్తిగా తప్పుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. కుటుంబ సభ్యులు, స్నేహితుల సలహా మేరకే రేణూదేశాయ్‌ ఈ నిర్ణయం తీసుకుందట. ఇంకా వదినా అంటూ పవన్‌ అభిమానులు పిలవడం. కొన్ని మార్ఫింగ్‌ ఫోటోలు అసభ్యకరంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం లాంటివి ఆమెని తీవ్రంగా కలచి వేశాయట. 

తాజాగా నిశ్చితార్ధం చేసుకుని, కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్న రేణూదేశాయ్‌కి కొత్త కాపురంలో పాత కాలపు చెడు జ్ఞాపకాల కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదనే ఉద్దేశ్యంతోనే రేణూదేశాయ్‌ ఈ నిర్ణయం తీసుకుందట. ఆమె సన్నిహితులు, శ్రేయోభిలాషులు రేణూ నిర్ణయాన్ని 100 పర్సెంట్‌ సమర్ధిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS