టాలీవుడ్లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్టయ్యింది. క్లాస్ దర్శకుడిగా పేరు పొందిన శేఖర్ కమ్ముల... నాగచైతన్యతో కలసి ఓ సినిమా చేయబోతున్నాడని టాక్. ఈ చిత్రంలో కథానాయికగా సాయి పల్లవి నటిస్తుందని సమాచారం. `ఫిదా`తో సాయి పల్లవిని టాలీవుడ్‌కి తీసుకొచ్చింది శేఖర్ కమ్ములనే. మళ్లీ ఈ కాంబినేషన్ సెట్టవ్వడం, అందులో నాగచైతన్య కథానాయకుడిగా నటించడం - ఈ ప్రాజెక్టుకు మరింత పాపులారిటీ తీసుకొచ్చే అంశాలు. సాధారణంగా శేఖర్ కమ్ముల కొత్త వాళ్లతో సినిమా చేయడానికి ప్రయత్నిస్తుంటారు.
కానీ ఈసారి తను అనుకున్న కథ నాగచైతన్యకు అయితే బాగుంటుందని భావించార్ట. శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడితో పనిచేయాలని చైతూకి ఎప్పటి నుంచో ఉంది. దాంతో ఈ ప్రాజెక్టు సెట్టయిపోయింది. దిల్‌రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించే అవకాశాలున్నాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.