చైతూతో.. ర‌ష్మిక?

By Gowthami - February 12, 2020 - 16:00 PM IST

మరిన్ని వార్తలు

నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోంది. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రానికి నాగేశ్వ‌ర‌రావు అనే పేరు పెట్టిన‌ట్టు స‌మాచారం. ఇందులో క‌థానాయిక పాత్ర కోసం ర‌ష్మిక పేరు ప‌రిశీలిస్తున్నార్ట‌. ప‌ర‌శురామ్ గ‌త చిత్రం `గీత గోవిందం`లోనూ ర‌ష్మిక‌నే క‌థానాయిక‌. ఆ సినిమాలో ర‌ష్మిక పాత్ర‌, ఆమె న‌ట‌న‌.. హైలెట్‌గా నిలిచాయి. ర‌ష్మిక ఆ సినిమాతోనే స్టార్ అయిపోయింది.

 

ద‌ర్శ‌కుడిగా ప‌ర‌శురామ్ రేంజ్ కూడా ఈ సినిమాతోనే పెరిగింది. అందుకే ఆ సెంటిమెంట్‌తో ర‌ష్మిక‌ని మ‌రోసారి క‌థానాయిక‌గా ఎంచుకున్నార‌ని తెలుస్తోంది. మార్చిలో ఈ చిత్రం లాంఛ‌నంగా ప్రారంభం అవుతుంద‌ని, ఈ యేడాది జూన్ - జూలైలో గానీ, ద‌స‌రాకి గానీ విడుద‌ల చేస్తార‌ని స‌మాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS