బన్నీ తర్వాత చిరంజీవితోనే.!

మరిన్ని వార్తలు

బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ప్రస్తుతం బన్నీ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాని టేకప్‌ చేయడానికి ముందు సుకుమార్‌ చాలా గ్యాప్‌ తీసుకున్నారు. ఆ గ్యాప్‌లో సుకుమార్‌ ఏం చేశారంటే, చిరంజీవి కోసం స్క్రిప్టు సిద్ధం చేశారట. ఇంతకీ ఏంటా స్క్రిప్టు అనుకుంటున్నారా.? ‘లూసిఫర్‌’. మయాళ బ్లాక్‌ బస్టర్‌ ‘లూసిఫర్‌’ సినిమాలో రామ్‌ చరణ్‌ నటించనున్నాడన్న వార్తలు వినిపించాయి అప్పట్లో. అయితే, ఆ సినిమాని చరణ్‌ కోసం కాదట. చిరంజీవి కోసమనీ తాజాగా అందుతోన్న సమాచారం.

 

ఈ సినిమాని హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో మెగా కాంపౌండ్‌ హీరోల్లో ఎవరో ఒకరితో రీమేక్‌ చేయనున్నారన్న అప్పటి వార్తలకు ఇప్పుడు బలం చేకూరింది. ఈ రీమేక్‌లో నటించబోయేది చిరంజీవి అని మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఆ ప్రాజెక్ట్ సుకుమార్‌ చేతికి వచ్చిందట. ఆల్రెడీ సుకుమార్, చిరంజీవి కోసం ఆ స్క్రిప్టులో మార్పులు చేయడం కూడా జరిగిపోయాయట. పర్‌ఫెక్ట్‌ స్క్రిప్టు సిద్ధంగా ఉందట. బన్నీ సినిమా పూర్తి కాగానే, సుకుమార్‌ ఆ సినిమాని పట్టాలెక్కించనున్నాడట. ఈ లోగా ఇటు చిరంజీవి, కొరటాల సినిమానీ అటు సుకుమార్‌, బన్నీ సినిమానీ పూర్తి చేయనున్నారనేది లేటెస్ట్‌ ముచ్చట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS