వరుసపెట్టి సినిమాలు చేస్తూ అలాగే కొత్త సినిమాలకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు నాగ చైతన్య. ఈ తరుణంలోనే దర్శకుడు మారుతీ దర్శకత్వంలో శైలజరెడ్డి అల్లుడు చిత్రం చేయడానికి అంగీకరించాడు.
ఇక ఈ సినిమాలో టైటిల్ పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుండగా అల్లుడు పాత్రలో చైతు మెరవనున్నాడు. అయితే ఈ చిత్రం నాగార్జున గతంలో చేసిన ‘అల్లరి అల్లుడు’ చిత్రాన్ని పోలి ఉంటుంది అని సమాచారం. ఆ చిత్రంలో కూడా అత్త పాత్ర చుట్టూనే సినిమా మొత్తం తిరగడం అలాగే ఇప్పుడు కూడా ఈ చిత్రంలో అత్త పాత్రనే ముఖ్యంగా కనిపిస్తుండడంతో ఈ పోలికలు కనిపిస్తున్నాయి.
అయితే ఈ పోలికలకి సంబంధించి వస్తున్న వార్తల పైన యూనిట్ స్పందించాల్సిఉంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి 11 నుండి మొదలుకానుంది. అను ఇమాన్యుల్ నాగ చైతన్య పక్కన హీరోయిన్ గా నటించనుంది, మరొక హీరోయిన్ ఈ చిత్రంలో ఉందా లేదా అన్నదాని పైన స్పష్టత రావాల్సి ఉంది.
ఈ వార్తల్లో గనుక నిజం ఉంటే- తండ్రి సినిమాని రీమేక్ చేసే పనిలో కొడుకు ఉన్నట్టే లెక్క.