అక్కినేని ఇంటి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగ చైతన్య కెరియర్లో హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువగా ఉన్నాయి. హిట్ చూసి చాలా రోజులయ్యింది. థాంక్యూ, కస్టడీ డిజాస్టర్ల గా నిలిచాయి. మొదటిసారిగా OTT కోసం దూత వెబ్ సిరీస్ లో నటించి, హిట్ అందుకున్నాడు. త్వరలో దూతకి సీక్వెల్ కూడా రానున్నట్లు అనౌన్స్ చేసారు. ఇప్పడు తండేల్ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించటానికి రెడీ అవుతున్నాడు. తండేల్ హిట్ గ్యారంటీ అన్న నమ్మకం తో ఉన్నాడు చైతు. ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. వీరి కాంబోలో వచ్చిన లవ్ స్టోరీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. వీరి జోడికి మంచి మార్కులు పడ్డాయి. మళ్ళీ ఈజోడి ఆడియన్స్ ని అలరించటానికి రెడీ అవుతున్నారు.
తండేల్ సినిమా తర్వాత చైతు, కార్తీక్ దండు దర్శకత్వంలో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కార్తీక్ విరూపాక్ష మూవీతో మంచి హిట్ సాధించాడు. ఈ సినిమా కార్తీక్ కిమంచి పేరు తెచ్చిపెట్టింది. గతేడాది ఏప్రిల్ లో విడుదలైన విరూపాక్ష మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 100 కోట్లకు పైగా గ్రాస్ తో వసూళ్ల పరంగా కూడా ది బెస్ట్ అనిపించుకుంది. ఇండస్ట్రీలో కార్తీక్ దండు పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. విరూపాక్ష తరవాత తనతో కలిసి వర్క్ చేయటానికి పలువురు హీరోలు ఆసక్తి కనబరిచినా ఇప్పటివరకు కార్తీక్ ఎలాంటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు.
ఇన్నాళ్ళకి కార్తీక్ నెక్స్ట్ ఫిలిం నాగ చైతన్యతో స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కార్తీక్ చెప్పిన స్టోరీ చైతన్యకి బాగా కనెక్ట్ అయ్యిందని, ఈ ప్రాజెక్ట్ కి చైతు ఓకే చెప్పినట్టు సమాచారం. 'విరూపాక్ష' లానే ఈ స్టోరీ లైన్ ఉంటుందని, ఈ ప్రాజెక్ట్ కూడా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లోనే రూపొందనుందని, అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో రానుంది అని టాక్.