గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RRR తరవాత గేమ్ చేంజర్ మూవీతో వస్తున్నాడు. నెక్స్ట్ ఉప్పెన సినిమాతో బ్లాక్ బ్లస్టర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. RC 16 అన్న వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్నఈ మూవీకి ఇటీవలే గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చెర్రీకి జోడిగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ మూవీ పై మెగా ఫాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. చెర్రీకి పాన్ ఇండియా రేంజ్ లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. హాలీవుడ్ సినిమాల్లో కూడా చరణ్ కి ఛాన్స్ లు వస్తున్నాయి. కానీ ఇంట గెలిచి రచ్చ గెలవాలని చెర్రీ వాటిని హోల్డ్ లో పెడుతున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో చెర్రీకి బుచ్చి బాబు మంచి హిట్ ఇస్తాడా అని సంశయంతో ఉన్నారు.
ఈ క్రమంలోనే RC16 సినిమా గురించి ఏ వార్త వచ్చినా, ఫాన్స్ నిముషాల్లో వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ మూవీ నుంచి ఒక ఇంట్రస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో విలన్ గా సంజయ్ దత్ నటిస్తున్నట్టు సమాచారం. ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలిగిన సంజయ్ దత్, ఇప్పుడు సౌత్ లో విలన్ గా వరస అవకాశాలు అందుకుంటున్నాడు. మొదట KGF లో అధీర గా అందర్నీ మెప్పించాడు. నెక్స్ట్ రామ్ పూరి జగన్నాథ్ కాంబో మూవీ 'డబల్ ఇస్మార్ట్' లో విలన్ గా, మోస్ట్ అవైటెడ్ పాన్ వరల్డ్ మూవీ పుష్ప 2 లో డాన్ గా కనిపించ నున్నాడని సమాచారం. ఇప్పుడు RC16 సినిమాలో కూడా విలన్ గా ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.
RC 16 లో సంజయ్ దత్ విలన్ అనగానే అంచనాలు పీక్స్ కి చేరాయి. విలన్ క్యారక్టర్ కూడా, బలంగా ఉండబోతోంది అని ఫాన్స్ ఫిక్స్ అయిపోయారు. మాస్ సీన్స్ పుష్కలంగా ఉండే ఛాన్స్ ఉందని ఆశ పడుతున్నారు. చరణ్, సంజయ్ దత్ లు కలిసి వర్క్ చేయటం ఇదే మొదటిసారి కాదు. ఇంతకముందు 'జంజీర్' సినిమాలో కలిసి నటించారు. మళ్ళీ ఇన్నాళ్ళకి కలిసి వర్క్ చేయనున్నారు. ఏ ఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు.